పంజాబ్ లో కాంగ్రెస్ పై చేయి

  • ఇండియా టుడే-యాక్సిస్ పోల్ సర్వే వెల్లడి
  • ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ వైపు మొగ్గు
  • రెండో స్థానంలో ఆప్, మూడో స్థానంలో ఎస్ ఏ ది-బిజెపి కూటమి

న్యూ ఢిల్లీ:  వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే పంజాబ్ శాసనసభ ఎన్నికల విజయావకాశాల్లో  కాంగ్రెస్ ప్రథమ స్థానంలో ఉండగలదని  ఇండియా టుడే-యాక్సిస్ పోల్ సర్వే సూచించింది. ఆ తర్వాతి స్థానం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి లభిస్తుండగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్(ఎస్ ఏ డి)-బీజేపీ కూటమి మూడో స్థానంలోకి జారిపోతోంది.  ప్రముఖ క్రికెటర్, మాజీ ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధూ ఇటీవలే బీజేపీ నుంచి బయటకు వచ్చి స్థాపించిన ఆవాజ్ ఏ పంజాబ్ పార్టీకి నాలుగవ స్థానం దక్కుతోంది. పంజాబ్ లోని 117 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచీ సేకరించిన 6వేలకు పైగా శాంపుల్స్ ఆధారంగా సర్వే ఈ ఫలితాలను ఆవిష్కరించింది.

కాంగ్రెస్ కు 33, ఆప్ కు 30, ఎస్ ఏ డీ-బిజెపి కూటమికి 22, ఇతరులకు 15 శాతం ఓట్లు లభించగలవని ఈ సర్వే సూచించింది.  ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వైపు 33 శాతం మంది మొగ్గు చూపారు. 25 శాతంతో ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, 16 శాతంతో ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్, 8 శాతంతో నవజోత్ సింగ్ ఆ తర్వాతి స్థానాలలో ఉన్నారు.

కాంగ్రెస్ కు 49-55, ఆప్ కు 42-46, ఎస్ ఏ ది-బిజెపి కూటమికి 17-21, ఇతరులకు 3-7 స్థానాలు రావచ్చని ఈ సర్వే సూచించింది. 

Leave a Reply

Your email address will not be published.