డీజే హీరోయిన్స్

అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న డీజే మూవీ టైటిల్ తోనే హైప్ క్రియేట్ చేసుకుంది. దువ్వాడ జగన్నాధం అనే పేరుతో రానున్న ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంతోనే అందరికి రిలీజ్ అయింది. ఈ దువ్వాడ జగన్నాధం ఎవరనే చర్చకూడా ఇండస్ట్రీలో జోరుగ సాగుతుంది. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కాజల్ నటిస్తుందని అంతా అనుకున్నారు. అయితే హరీష్ శంకర్ మాత్రం అందరి ఊహలను పక్కు నెట్టి ఓ ట్విస్ట్ ఇచ్చాడు.

అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబోలో ‘దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్’ రానుంది. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించి ఓ కొత్త విషయం బయటకు‌వచ్చింది. హీరోయిన్‌గా కాజల్‌ని ఓకే చేసినట్టు గాసిప్స్ హంగామా చేసినా, అలాంటిదేమీ లేదని, కొత్త బ్యూటీలను ఎంపిక చేసే పనిలో హరీష్ శంకర్ పడినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కాజల్ తమిళ్ తెలుగు సినిమాల్లో వరుసగా సైన్లు చేసుండటం వల్ల ఆమె డేట్స్ చాలా ఇబ్బంది కరంగా మారాయని అంటున్నారు. అందుకే కాజల్ ప్లేస్ లో మెహరిన్ ని తీసుకున్నారని అంటున్నారు.

హరీష్ శంకర్ తన డీజే మూవీలో అల్లు అర్జున్ ఇప్పటివరకు నటించని హీరోయిన్ ని ఈ సినిమాలోకి తీసుకోవాలనే ఆలోచనలో వున్నట్టు తెలుస్తుంది. మొదట కాజల్ ని అనుకున్నా తరువాత కాజల్ కి దగ్గర పోలికలు వున్న మెహరిన్ ని తీసుకుంటే ఫ్రెష్ లుక్ తో పాటు నిర్మాతలకు ఖర్చుకూడా తగ్గుతుందని అనుకున్నారట. ఎట్ ప్రజెంట్ మెహ‌రీన్‌ అల్లుశిరీష్‌తో ఓ ఫిల్మ్ చేస్తోంది.

మెహరిన్ తో పాటుగా దువ్వాడ జగన్నాథ్ సినిమాలో ‘జెంటిల్‌మన్’ మూవీతో ఫేమస్ అయిన నివేద థామస్ ని కూడా తీసుకోబోతున్నారట. అల్లు అర్జున్ ఇప్పటి వరకు చేయని హీరోయిన్లలో ఫ్రెష్ లుక్ వున్నవారు వీరిద్దరే అని యూనిట్ భావన. దానికి తోడు ఈ ఇద్దరు హీరోయిన్ల పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూర్డ్ గా వుంటుందని డైరెక్టర్ బన్నీతో చెప్పాడట. కాగా ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కూడా వున్నట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ కోసం కేథరిన్ ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published.