ఇప్పుడు త్రివిక్రం ది బెస్ట్!

ఒకప్పుడు దక్షిణ భారత చలన చిత్రరంగంలో నవలా కథానాయక వాణిశ్రీ. ఆమె నేటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరిపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు.

వాణిశ్రీ నటనకు యావత్ దక్షిణ భారత దేశం దాసోహం అంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె కు ప్రత్యేకమైన స్థానం వుంది. కొన్ని విషయాల్లో ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు.అప్పటి అమ్మాయిలు ఈమెను ఫాలో అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. అంతటి సీనియర్ నటి ఎవరిపైన అయినా కామెంట్స్ చేస్తే తప్పకుండా అవి ఆసక్తిని రేకెత్తిస్తాయి.

టాలీవుడ్ లో ప్రస్తుతం వున్న డైరెక్టర్లలో త్రివిక్రం శ్రీనివాస్ బెస్ట్ అని అంటారు వాణిశ్రీ. మానవ సంబంధాలు,సంస్కృతి సంప్రదాయాలను తెరమీద చక్కగా చూపిస్తున్నాడని త్రివిక్రంపై పొగడ్తల జల్లు కురుపించారు. తన సినిమాల్లో కామిడి చాలా హెల్తీగా వుంటుందని అన్నారు.అంతే కాదు, త్రివిక్రం డైరెక్షన్ ని సెట్ లో వుండి డైరెక్ట్ గా చూడాలని వుందంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.

త్రివిక్రమ్ ను పొగడ్తలతో ముంచెత్తిన వాణిశ్రీ అల్లుఅర్జున్, రవితేజలపైన కూడా కామెంట్స్ చేసారు. వీళ్ళు నిజంగా అలా ఉంటారా, లేకపోతే దర్శకుడు చెప్పి వీళ్ళచేత అలా చేయిస్తూ ఉంటారా అన్న విషయాన్ని తెలుసుకోవడానికైనా తాను వాళ్ళు నటించే సినిమాల షూటింగ్ కు వెళ్ళి దగ్గర ఉండి చూడాలనిపిస్తోందంటూ అంటూ తన ఆసక్తిని వెల్లడించారు.

నేటి తరం హీరోయిన్ల గురించి కూడా వాణిశ్రీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు పెద్దగా రావడంలేదు కాబట్టి ఉన్న పాత్రలతోనే హీరోయిన్స్ సరిపెట్టుకుంటూ వాళ్ళవాళ్ళ పరిధులలో బాగానే నటిస్తున్నారని అన్నారు. తనకు అనుష్క అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published.