‘ఎవడో ఒకడు’గా నాని

కొంతకాలం క్రితం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా దిల్ రాజు ఓ  సినిమా చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో ఈ కథను నాగార్జునతో తెరకెక్కించాలని దిల్ రాజు అనుకున్నాడు. నాగార్జున దగ్గరికి ఈ కథ వెళ్లగా ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఈ కథపై నమ్మకం వున్న దిల్ రాజు, ఎలాగైనా తెరకెక్కించాలనే పట్టుదలతో వున్నాడు. ఈ క్రమంలో హీరో నాని ఫ్రేమ్‌ లోకి తెచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం నాని సినిమాలకి ఫుల్ స్టాప్ అనేదే లేదు. వరస హిట్స్ తో బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టిస్తూ దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం త్రినాథరావు దర్శకత్వంలో ‘నేను లోకల్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం దిల్ రాజు బ్యానర్  లో నిర్మితమవుతోంది. ఇప్పుడు ఇదే బ్యానర్ నుండి మరో సినిమా ఆఫర్ నానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మినిమం గ్యారంటీ హీరో అయిన నానికి ఆ కథ పక్కాగా సరిపోతుందని   చెబుతున్నాడట దిల్‌ రాజు

‘ఎవడో ఒకడు’ అనే  టైటిల్ తో ఓ మూవీ వస్తోందనే మాట టాలీవుడ్ లో ఏడాదికి పైగా వినిపిస్తోంది. వేణు శ్రీరామ్ డైరెక్టర్ గా, దిల్ రాజు బ్యానర్ పై తలపెట్టిన మూవీ ఇది. బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో.. ఈ కథపై బోలెడంత నమ్మకంగా ఉన్న దిల్ రాజు.. ఎలాగైనా ఎవడో ఒకడుని సెట్స్ మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తూ.. ఇప్పుడు నాని దగ్గర సెర్చింగ్ ఆపాడని అంటున్నారు..  నాని ఆ ఒకడిగా మారేందుకు అంగీకరించినా.. నేను లోకల్ తర్వాత మరో మూడు చిత్రాలు క్యూలో ఉండడంతో.. ఇది పట్టాలెక్కేందుకు కనీసం ఏడాది పడుతుంది. ఆలోగా ఈ ఎవడో ఒకడు ఎన్ని టర్న్స్ తీసుకుంటాడో ననే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.