ఫస్ట్ లుక్ ల సందడే సందడి

దీపావళికి టాలీవుడ్ లో ఫస్ట్ లుక్ లు సందడి చేస్తున్నాయి. దసరా, సంక్రాతులకు కొత్త సినిమాలు రిలీజ్ చేసినట్టు దీపావళికి ఫస్ట్ లుక్ లు విడుదల చేయడం ఆనవాయితి. ఈ దీపావళికి తెలుగు సినిమాలేవీ విడుదలకాకపోయినా డబ్బింగ్ సినిమాలు మాత్రం రిలీజ్ అయ్యాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కాటమరాయుడు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. డాలీ డైరెక్షన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కాటమరాయుడు సినిమా ఫస్ట్ లుక్ అభిమానులకు పండుగ కానుకగా మారింది. ఇందులో పవన్ కళ్యాన్ పూర్తి మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు. లుంగీ కట్టుకుని సైకిల్ తొక్కుతున్న పల్లెటూరి యువకుడిలా వున్నాడు పవన్ కళ్యాన్.

ఈ దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన మరో ఫస్ట్ లుక్ ధృవ. చరణ్ చాలా లాంగ్ గ్యాప్ తరువాత సినిమా చేస్తుండటంతో అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో హైప్ క్రియేట్ అయిన ధృవ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇందులో చరణ్ బుల్లెట్ పై వస్తున్న లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.

నాని – కీర్తిసురేష్ జంటగా  రానున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫిల్మ్ ‘నేను లోకల్’. దీపావళి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. డిఫరెంట్ లుక్ తో  నాని స్టైల్ గా కాసింత రఫ్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు తను చేసిన రోల్స్ లో ఇది భిన్నంగా ఉంటుందని చెబుతోంది యూనిట్. లోకల్ గా వుండే ఓ కుర్రాడు నాన్ లోకల్ అమ్మాయిని ఎంతలా లవ్ చేశాడనే స్టోరీతో తెరకెక్కుతోందట ఈ సినిమా.

Leave a Reply

Your email address will not be published.