చిరుతో దాసరి

రామ్ లీలా, జీనియస్ లాంటి సినిమాలను నిర్మించిన దాసరి కిరణ్  ఇప్పుడు వర్మతో కలిసి ‘వంగవీటి’ని పట్టాలెక్కిస్తున్నాడు. అలానే బుల్లితెర నటుడు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ తో ‘సిద్ధార్థ’మూవీని కంప్లీట్ చేసేసి ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. సుమారు 300 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.

నిర్మాత దాసరి కిరణ్ సిద్ధార్ధా మూవీ ప్రమోషన్ లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో షారూఖ్ ఖాన్ కూడా బుల్లి తెర నుంచే వెండితెరకు పరిచయమై, బాలీవుడ్లో నెంబర్ వన్ హీరో అయ్యాడు. అలా సాగర్ కూడా బుల్లితెర నుంచి వెండితెరకు వస్తున్నాడు. అతని నటన చూస్తుంటే తప్పకుండా వెండితెరపైనా క్లిక్ అవుతాడనిపిస్తుందని అన్నాడు. ఇప్పటికే సీరియల్స్ తో మహిళా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమాతో మరింత చేరువ అవుతాడు’ అని తెలిపాడు.

సిద్ధార్ధ  సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని దాసరి కిరణ్ అన్నారు. మలేషియాలో 28 రోజుల పాటు చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయని దాసరి అన్నారు. తప్పకుండా సాగర్ ఓ మంచి హీరో అవుతాడని’ఆయన తెలిపాడు. చిరు అభిమానిగా తన కోరిక కిరణ్ ఏంటో వెల్లడించాడు. తన ఆరాధ్య నటుడు చిరంజీవి అవకాశం ఇస్తే తన 151వ సినిమాగా చాలా కాలం నుంచి ఊరిస్తున్న ‘ఉయ్యలవాడ నరసింహారెడ్డి’మూవీని ఎంత ఖర్చైనా తెరకెక్కిస్తానని పేర్కొన్నాడు.

ఇప్పటికే ఉయ్యలవాడ  నరసింహారెడ్డి స్క్రిప్ట్ ని పరుచూరి బ్రదర్స్ ఎప్పుడో  రెడీ చేసేశారని దాసరి కిరణ్ అన్నారు. కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని పట్టాలెక్కించడానికి  ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు ఆయన అన్నాడు.  ఇక ప్రస్తుతం తన దృష్టంతా  వర్మ ‘వంగవీటి’ సినిమా పైనే ఉందని, ఇది ఏ ఒక్క వర్గానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ వుండదని కిరణ్ తెలియచేశాడు.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.