బిపాసాపై మోడీ ఎఫెక్ట్  

పెద్దనోట్లు బ్యాన్ చేయడంతో దేశవ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది.దీనివల్ల దేశాభివృద్ధికి ఎంతో ప్రయోజనం వున్నప్పటికి సామాన్యులకు కొంత తాత్కాలిక ఇబ్బంది కలిగుతుందన్నది వాస్తవం.ఇందులో సామాన్యులే కాదు సినిమా వారుకూడా ఇబ్బందుల పాలు అవుతున్నారు.బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు కూడా మోడీ చర్యతో  ఇబ్బంది పడుతోందట.

దేశ ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న పెద్దనోట్ల బ్యాన్ నిర్ణయంతో దేశంలో తాత్కాలిక సమస్యలు ఏర్పడ్డాయి.నల్లధనం,దొంగనోట్ల నియంత్రణ కోసం కేంద్ర తీసుకున్న చర్యకు అంతటా హర్హం వ్యక్తమవుతోంది.దీంతో బీరువాల్లో దొంగతనంగా దాచిన వెయ్యి ఐదువందల నోట్లు మురిగిపోయాయి.కాగా వ్యాపారులు సైతం 500, 1000 నోట్లు ఇస్తుంటే తీసుకోకపోవడంతో నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి చిల్లర లేక జన అవస్థలు పడుతున్నారు.

పెద్దనోట్లను రద్దు చేయాలన్న ప్రధాని నిర్ణయంతో సామాన్యుడినుంచి సెలబ్రిటీలవరకు అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులోకి బాలీవుడ్‌ బ్యూటీ బిపాసా బసు కూడా చేరిపోయింది. ఈ విషయం ఆమె ట్విట్టర్‌ద్వారా తెలియజేసింది.500, 1000  నోట్లను మోడీ రద్దు చేయడంతో బిపాసా బసువద్ద కోడిగుడ్లు కొనుక్కోవడానికి చిల్లర డబ్బులు లేకుండా పోయాయట. దీంతో రాకీస్టార్‌ దగ్గర్నుంచి డబ్బులు అప్పు తీసుకుని గడిపేసానంటోంది బిపాసా.

పెద్దనోట్లు బ్యాన్ చేయడంతో సినిమా పరిశ్రమపై చాలా ప్రభావం పడింది.ప్రస్తుతం నిర్మాణం పూర్తికాని సినిమాలు ముందుకు,వెనక్కు వెళ్ళలేక అయోమయంలో పడ్డాయి.కాగా బ్లాక్ మనీ వైట్ చేసుకోడానికి కొందరు నిర్మాతలు టెక్నీషియన్లకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తునట్టు టాక్.

 

Leave a Reply

Your email address will not be published.