‘గోపీచంద్’ సినిమా @4

ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవిత కథతో హీరో సుధీర్ బాబు సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈమధ్యే తన వద్ద శిక్షణ తీసుకున్న పీవీ సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతో గోపీచంద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ కథతో సినిమా రావాల్సిన అవసరం ఉందని, సుధీర్ టీమ్ ప్రీ ప్రొడక్షన్‍ను వేగవంతం చేసేసింది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించనున్నారు. ఈ  సినిమాకు సంబంధించిన ఓ వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ బయోపిక్ సినిమా ఎప్పటినుండో నానుతూ వస్తోంది. ఇప్పుడు గోపీచంద్ కోచింగ్‌ లో పివి సింధుకు సిల్వర్ మెడల్  సాధించింది కాబట్టి,  ఇదే సరైన టైమ్ అని ఫిక్సయ్యారట.  సినిమా పనులను  స్పీడప్ చేశారట.

ఇప్పటికే  రూపొందిన స్ర్కిప్టుకు కొన్ని మార్పులూ చేర్పులూ చేస్తున్నారు. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టడానికి ఎంతగా శ్రమించాడో చెబుతున్నారు. అయితే ఈ కథకు మాటల వర్షెన్ ను ఏకంగా మూడు బాషల్లో రాస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ వర్షెన్ తో పాటు ఇప్పుడు హిందీలో కూడా డైలాగులు రాయిస్తున్నారు.

సుధీర్ బాబు బాగీ సినిమా తరువాత హిందీలో కూడా కాస్త పాపులర్ కావడంతో హిందీలో కూడా సినిమాను రూపొందించాలని ఫిక్స్ అయ్యారు నిర్మాతలు. ఇక తమిళంలోకి కూడా డబ్‌ చేసి రిలీజ్ చేయాలని యూనిట్‌ ప్లాన్ అట.  మొత్తానికి ఒక మిల్కా సింగ్.. మేరీ కోం.. ఒక ధోని.. బయోపిక్ తరహాలో ఇప్పుడు గోపిచంద్ సినిమా కూడా భారీ స్థాయిలో నాలుగు భాషలలో రూపొందుతుందన్నమాట. మరి ఈ చిత్రంతో సుధీర్ బాబు రేంజ్ ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.