ఇండస్ట్రీకి మోడీ షాక్

గత రాత్రి 500.. 1000 రూపాయల నోట్లు రద్దు చేసేస్తూ  ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన షాక్  సినిమా ఇండస్ట్రీ పై పెద్ద ప్రభావాన్నే చూపిస్తోంది. బ్లాక్ మనీని అడ్డుకునే లక్ష్యంతో చేపట్టిన ఈ చర్య.. ఒక విధంగా మంచి పనే అయినా సడెన్ గా ఇచ్చిన షాక్ తో ఇటు సెట్స్ పై ఉన్న సినిమాలపై , అటు రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలపై కచ్చితంగా  ప్రభావం పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ట్రేడ్‌ జనాలు.

నల్ల ధనాన్ని అరికట్టే క్రమంలో నరేంద్ర మోడీ తీసుకున్న కరెన్సీ రద్దు చర్య ప్రభావం చూపే రంగాల్లో సినీ రంగం కూడా ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ పై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చంటున్నారు . కనీస మాత్రంగా సమయం ఇవ్వకుండా.. గంటల వ్యవధిలో కరెన్సీ రద్దు చేసేయడంతో.. ఇప్పటికిప్పుడు కేవలం 100 రూపాయల డినామినేషన్ తో పెద్ద మొత్తాలను పోగు చేయాలంటే..అందిరికి  తలకుమించిన పనే అవుతుంది

సినిమా ఇండస్ట్రీలో రోజువారి సెటిల్మెంట్స్ చాలానే ఉంటాయి. కార్మికుల వేతనాలును ఎక్కువగా 500 లేదా వెయ్యి రూపాయలతోనే  చెల్లిస్తుంటారు. సినిమా నిర్మాణంలో బ్లాక్ మనీ పాత్ర గురించి కూడా చాలా రోజులుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు అసలు 500.. 1000 నోట్లే చెల్లవని చెప్పేయడంతో వీటిని తీసుకునేందుకు ఎవరూ సాహసించరు. దీంతో సెట్స్ పై ఉన్న సినిమాలపై  ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు విశ్లేషకలు

ఇక రిలీజ్ కాబోతున్న సినిమాలు చూడాలంటే టిక్కెట్ ను వంద నోట్లు ఇచ్చి కొనుక్కోవలసిన పరిస్థితి. 500 లేదా 1000 ఇచ్చిన వాటికి చిల్లర ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్షన్లు కూడా తగ్గుతాయనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వంద నోట్లకు బాగా డిమాండ్‌ పెరిగిపోవడంతో ఉన్న మనీని పరిస్థితి చక్కబడే వరకు వాడుకోవాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ వారం రిలీజ్ కానున్న సాహసం శ్వాసగా సాగిపో, ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.