గాలింటి పెళ్ళికి సినీ తాకిడి

గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె పెళ్ళి  రోజూ మీడియాలో నానుతూనే వుంది.  కొన్ని రోజులుగా  ఏనోట విన్నా గాలి ఇంటి పెళ్ళి వేడుక గురించే. భారీ సెట్స్ తో వందల కోట్లరూపాయలు ఖర్చుపెట్టి ఈ పెళ్ళి ఏర్పాట్లు చేసాడు గాలి జనార్ధన్. దాదాపు 500 కోట్ల రూపాయలు ఇందుకోసం ఖర్చుచేసినట్టు అంచనా.

పలానా వారింట్లో పెళ్ళి అంటే ఏడూళ్ళకు తెలియాలని సామెత వుండేది. ఏడూళ్ళు కాదు ఏకంగా భారత దేశమంతా తెలిసేలా చేస్తున్నాడు గాలిజనార్ధన్ రెడ్డి తన కూతురి పెళ్ళిని. పెద్దనోట్ల రద్దుతో అనుకున్న స్థాయిలో వివాహం జరిపించకపోవచ్చని అంతా అనుకున్నా, ఏమాత్రం తేడా లేకుండా ఏర్పాట్లు చేసేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి జరగబోయే ఈ వివాహ వేడుకకు సినీ సెలెబ్రెటీల హంగామా ప్రధానాకర్షణగా నిలవనుంది.

గాలి వారింట్లో పెళ్ళికి స్టేజ్ పర్ఫార్మెన్స్  ఇవ్వడానికి సినీ సెలబ్రిటీల్లో  ప్రియమణి అప్పుడే అక్కడికి చేరుకుందని సమాచారం. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెర్ ఫాం  చేయవచ్చునని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ధ్రువ సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న ఆమె బుధవారం నాటికి ఈ వెడ్డింగ్ కి హాజరై డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయవచ్చునని భావిస్తున్నారు.

టాలీవుడ్ నుండి  కమెడియన్లు బ్రహ్మానందం, ఆలీ ఈ పెళ్ళికి హాజరవుతున్నారు. బాలీవుడ్ నుండి షారరూఖ్ వస్తాడని అంతా అనుకున్నారు కానీ ఆయన రావట్లేదని అంటున్నారు. సింగర్ సోనూ నిగం, ఆయన టీమ్ అటెండ్ అవుతారట. కాగా వివాహానికి హాజరయిన సినీ సెలెబ్రెటీలకు రిటర్న్ గిఫ్ట్ కింద గాలి జనార్ధన్ రెడ్డి కోటిరూపాయలు ఇస్తున్నట్టు గతంలో ప్రచారం జరిగింది. మరి పెద్ద నోట్ల రద్దు తో ఇది ఎలా సాధ్యమవుతుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published.