సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాల పోటీ

ఏదైనా పండగ వస్తే చాలు సినీ లెజెండ్ హీరోల పిక్చర్స్ పోటీపడుతూ రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా ఇద్దరు సినీ దిగ్గజాల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిన ఈవెంట్ జరగలేదు.  అయితే ఇద్దరు టాప్ స్టార్స్ మూవీస్ ఒకేసారి వచ్చిన సంఘటనలు గతంలో చాలానే ఉన్నాయి.

ఇద్దరు టాప్ స్టార్స్ మూవీస్ ఒకేసారి రిలీజ్ కావడం చాలా అరుదు. ఒక బిగ్ స్టార్ సినిమా ఇంకో బిగ్ స్టార్ మూవీతో ఢీకొని చాలాకాలమే అయింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు ఒకేసారి విడుదలై విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసిన ఇన్సిడెంట్స్ గతంలో చాలానే ఉన్నాయి. పండగలకు వీరి సినిమాలు ప్రేక్షకులకు కన్నుల పండగే అయ్యేవి.

సంక్రాంతి, దసరా వంటి పండగలొస్తే చాలు ఫ్యాన్స్ ఫేవరేట్ హీరోల సినిమాలు వచ్చేవి. స్టార్ డమ్ హీరోలు చేసిన భారీ చిత్రాలు ఒకదానితో ఒకటి తలపడేవి. అదివరకు చాలాసార్లు బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు ఒకేసారి వచ్చేవి. ఇద్దరు హీరోల్లో ఎవరి పిక్చర్ హిట్టవుతుందా అని అంతా టెన్షన్ తో చూసేవారు. వాళ్లిద్దరి సినిమాలు ఒకేసారి రిలీజైతే ఆ హడావుడి ఇంతా అంతా కాదు. ఓ ఉత్సవంలా, పండగలా, మూవీల మధ్య యుద్ధంలా ఉండేది.

ఆ పోటీలో ఒకసారి మెగాస్టార్ పిక్చర్ హిట్టయ్యేది. ఇంకోసారి బాలకృష్ణ సినిమా విజయం సాధించేది. కొన్నిసార్లు ఇద్దరి సినిమాలు సమానంగా కలెక్షన్స్ రాబట్టేవి. ఇంతవరకు 18 సార్లు వీరిద్దరి సినిమాలూ ఒకేసారి వచ్చాయి. ఈ మధ్య చాలాకాలంగా అంటే ఇద్దరి సినిమాలూ ఒకేసారి రాలేదు. 2001లో సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకేసారి వచ్చాయి. చిరంజీవి మృగరాజు గా వస్తే, బాలకృష్ణ నరసింహనాయుడు గా వచ్చారు.

ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి 19వ సారి బాక్సాఫీస్ పోటీకి దిగబోతున్నారు. వచ్చే సంక్రాంతికి వీళ్లిద్దరి సినిమాలూ రాబోతున్నాయి. చిరంజీవి 150 సినిమా ఖైదీ నంబర్ 150 చేస్తుంటే, బాలకృష్ణ తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి చేస్తున్నాడు. ఇద్దరికీ ఇవి ప్రతిష్టాత్మకమైన సినిమాలే. కాబట్టి ఇద్దరి సినిమాల మధ్య పోటీ కూడా ఇంట్రెస్టింగ్ గా, బలంగా ఉండొచ్చు.

Leave a Reply

Your email address will not be published.