ధ్రువ సెట్ లో చిరంజీవి

మెగా ఫ్యామిలీలో ఎవరు ఏది చేసినా అదుర్సే. అదో సెన్సేషన్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంబంధించి, పర్సనల్ గానూ ఎన్నో విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. అవి అట్టాంటి ఇట్టాంటి విశేషాలు కావు. సూపర్ డూపర్ మెగా మ్యాజిక్ లే అనవచ్చు. అంత ఇంట్రెస్టింగ్ విశేషాలేంటబ్బా  అనిఅప్పుడే మీరు ధింకింగ్ స్టార్ట్ చేశారు కదూ.

మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో  వెయిట్ చేస్తున్న  చిరంజీవి మూవీ  ఖైదీ నంబర్ 150 షూటింగ్ విషయంలో నిన్నగాక మొన్న ఒక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ పిక్చర్ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఈ మూవీకోసం  చిరంజీవి కాంబినేషన్ లో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తీయడానికి ప్రత్యేక మైన సెట్  అక్కర్లేకుండా  పవన్ కళ్యాణ్ తాను చేస్తున్న కాటమరాయుడు సెట్ ని వాడుకోమని చెప్పడం తెలిసిందే.

అంతలోనే మరో ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదికూడా  చిరంజీవికి సంబంధించిందే. చిరంజీవి తనయుడు రాంచరణ్ ఒకవంక డాడీ 150వ పిక్చర్ కు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూనే  మరోవైపు తను యాక్ట్ చేస్తున్న  ధ్రువ సినిమా షూటింగ్ లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు.  ధ్రువ కోసం ఓ స్పెషల్ సాంగ్ తీస్తున్నారు. అంతలో ఓ అద్భుతం జరిగింది.

‘ధ్రువ’ సినిమా కోసం రాంచరణ్ ఇంట్రో సాంగ్ ను షూట్  చేస్తున్నారు. సినిమాలో ఈ సాంగ్ హైలైట్ అవుతుందట. ఈ సాంగ్ తీస్తున్నప్పుడే ఓ ఆశ్యర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి హఠాత్తుగా అక్కడికి వచ్చాడు. దాంతో సెట్లోని వాళ్లంతా ఆశ్చర్యపోవడమే కాదు. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. సాంగ్ తీస్తున్న యూనిట్  చిరంజీవితోను .. చరణ్ తోను కలిసి సెల్ఫీ తీసుకున్నారు. చరణ్ ఈ ఫోటోను ఫేస్ బుక్ లో పెట్టడంతో  ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published.