చందూతో చైతూ మరో మూవీ

అనుకున్నామని జరగవు అన్నీ… అంటారు. ఇది ఎక్కడైనా, దేనికైనా వర్తిస్తుంది. సినిమా వారికి కూడా సూట్ అవుతుంది. ఒక్కోసారి ప్లాన్ వేసుకున్నా ఆ పని జరగదు. ఇంకేదో పని జరుగుతుంది. అది వాయిదా పడి, మరోటి జరుగుతుంది. ఒక సినిమా చేద్దామనుకుని రెడీ అయితే… ఇంకో సినిమా చేయాల్సి వస్తుంది. ఓ హీరో విషయంలో అదే జరిగింది.

దసరాకు వచ్చిన నాగచైతన్య మూవీ ప్రేమమ్ మంచి టాక్ తెచ్చుకుని బాగా రన్ అవుతోంది. కలెక్షన్స్ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. మూవీ హిట్ అయింది. ఈమధ్య హిట్ లేని చైతూకి  చాలాకాలం తర్వాత ప్రేమమ్ సక్సెస్ నిచ్చింది. అయితే

‘ప్రేమమ్’ సినిమా సెట్స్ కి వెళ్లడానికి ముందు ఓ ట్విస్ట్ జరిగింది.

దర్శకుడు చందూ మొండేటి .. నాగచైతన్యతో ఒక సినిమా చేయాలనుకుని, స్టోరీ రెడీ చేసుకుని నాగార్జునకు, చైతూకి వినిపించాడు. తండ్రీ తనయులిద్దరికీ కథ నచ్చింది. తప్పకుండా చేద్దామన్నారు. అయితే సరిగ్గా ఆ టైమ్ లోనే మలయాళంలో ‘ప్రేమమ్’  రిలీజై హిట్ అయింది. ఆ సంగతి తెలుసుకున్న నాగచైతన్య ఆ మూవీని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు.

ప్రేమమ్ పై చైతూ ఇంట్రెస్ట్ గా ఉండడంతో చందూ, తన కథను పక్కన పెట్టేసి, మలయాళ మూవీనే రీమేక్ చేసి హిట్ ఇచ్చాడు. అయితే అదివరకు చైతూ కోసం చందూ రెడీ చేసిన కథ అలాగే ఉంది. ఆ స్టోరీపై చైతన్యకు ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉందట. పైగా ఒకసారి ఓకే చేశాం కనుక చేయాలనుకుంటున్నాడట. కాబట్టి  ఈ ఇద్దరి కాంబినేషన్ మరో మూవీ రావడం ఖాయమని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.