అసభ్యంగా బట్టలేసుకుందని…

రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమెకున్న సినిమాలు తక్కువేకాని తనపై వచ్చిన కామెంట్స్ మాత్రం చాలా వున్నాయి. ఎప్పుడు హాట్ హాట్ గా డ్రెస్సులేసి రెచ్చకొట్టడంతో పాటు ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుని అందరి నోట్లో నలుగుతుంది. రీసెంట్ గా ఆమె పై మరో కేసు బుక్ అయింది.

రాఖీ సావంత్ అంటే బాలీవుడ్ సెక్సీ బాంబ్ అని అందరికి తెలుసు. ఆమె ఎప్పుడు బయటకు వచ్చినా వెంటనే కాంట్రవర్సీ ఆత్రంగా ఎదురు చూస్తుంటుంది. ఆమె మాట్లాడినా మాట్లాడకపోయినా వివాదం మాత్రం గ్యారెంటి. రీసెంట్ గా ఆమె అసభ్యకరమైన బట్టలతో రెచ్చగొడుతోందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

రాఖీ సావంత్ సెలెబ్రెటీ అయుండి అసభ్యకరమైన బట్టలు వేసుకుని కావాలని యువతను రెచ్చగొడుతుందని రాజస్థాన్ పోలీస్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదయ్యింది. రాజసమండ్ జిల్లా కాంక్రోలీ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు ఈ విషయాన్ని తెలిపారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు.

గతంలో కూడా యోగా డే సందర్భంగా అమెరికా వెళ్లిన రాఖీ నరేంద్రమోడి బొమ్మల ప్రింట్ తో  వున్న మినీ స్కర్ట్ వేసుకుని ఫొటోలను ట్విట్టర్లో పెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి ఆమె చర్యకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దాంతో మోడి తన డ్రీం మేన్ అంటూ మోడీ అభిమానులను కూల్ చేసింది. ఇప్పుడు మరోసారి అసభ్యకరంగా డ్రెస్ వేసుకుని వివాదంలో చిక్కుకుంది.మరి దీనికి రాఖీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.