దసరా పోటీకి రెడీ

ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు ఓ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. ఎన్ని సినిమాలు తమ సినిమాకు పోటి వచ్చినా పండగ పోటీలో మాత్రం నిలబడాల్సిందేనంటూ సీటేసుకొని కూర్చొంటున్నారు. ఈ నేపధ్యంలో బాక్సాఫీస్ వద్ద బడా ఫైట్‌ నెలకొంటోంది. ఇండస్ట్రీలో కూడా దసరా పండుగ హడావిడి ఎక్కువగానే ఉంటుంది. కొందరు సెంటిమెంట్ గా తమ సినిమాలను పండుగ రోజే రిలీజ్ కి రెడీ చేస్తుంటే మరి కొందరు దసరా సెలవులను క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఈ ఏడాది విజయదశమి కానుకగా బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద  ఫైట్‌ కి దిగబోతున్నాయి. తమన్నా, సోనూ సూద్‌, ప్రభుదేవా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన అభినేత్రి చిత్రం దసరా శుభాకాంక్షలతో అక్టోబర్ 7న మూడు భాషలలో విడుదల కానుంది.

అదే రోజు నాగ చైతన్య, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ప్రేమమ్‌, సునీల్‌ హీరోగా వస్తోన్న ఈడు గోల్డ్‌ ఎహే చిత్రం రిలీజ్‌ కి రెడీ అయ్యాయి. ఇక ప్రకాశ్‌ రాజ్  కూడా   దసరాకు  మన ఊరి రామాయణం చిత్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ఒక వైపు సినిమా రిలీజులతో టాలీవుడ్‌ అభిమానులు వినోదంలో తడిసి ముద్ద కానుండగా మరో వైపు షూటింగ్‌లో ఉన్న సినిమాలు తమ సినిమాకు చెందిన ట్రైలర్స్ , టీజర్స్ , పోస్టర్స్ ని దసరా కి విడుదల చేస్తూ వారి ఆనందాన్ని మరింత పెంచనున్నాయి.

నందమూరి బాలకృష్ణ వందో చిత్రానికి సంబంధించి బాలయ్య లుక్ అక్టోబర్ 9న, టీజర్ అక్టోబర్ 11న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇకపోతే మెగా అభిమానులు, చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ను ఈ దసరాకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.