అఖిల్ కోసం బన్ని త్యాగం

నాగార్జున చిన్న కొడుకు అఖిల్ తెరంగేట్రం చేసిన సినిమా `అఖిల్`. ఆ సినిమా ప్రేక్షకులను ఊహించిన రీతిలో అలరించలేకపోయింది. ఆ కారణం వలన అఖిల్ తన రెండవ చిత్రంపై దృష్టి సారించాలనుకున్నారు. అఖిల్ రీ ఎంట్రీ పై నాగార్జున కూడా తగు జాగ్రత్తలు తీసుకోనున్నారు. దర్శకుడి విషయంలో కొంత తర్జన భర్జన జరగగా, చివరకు అఖిల్ రెండవ చిత్రం విక్రమ్ తో డైరెక్షన్ చేయించాలని నిర్ణయించారు.

గతంలో విక్రమ్ తీసిన మనం, 24 అనే చిత్రాలు మంచి ప్రజాదరణ పొందాయి. అయితే విక్రమ్ దర్శకత్వంలో అఖిల్ నటించబోయే చిత్రం తుదిరూపు దాల్చడానికి మెగా హీరో అల్లు అర్జున్ కారణమయ్యాడని టాలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 24 మూవీ తర్వాత బన్నీతో విక్రమ్ చిత్రం చేయాలనుకున్నాడు. ఈ లోగా అఖిల్ కొరకు నాగార్జున విక్రమ్ ని కథ కొసం సంప్రదించడం జరిగింది. కథ సిద్ధంగా ఉంది కాని అల్లు అర్జున్ తో చిత్రం చేయాలని తన అభిప్రాయాన్ని విక్రమ్ వ్యక్తం చేశాడు.

విక్రమ్ వెలుబుచ్చిన అభిప్రాయం గురించి నాగార్జున అల్లు అర్జున్ కి ఫోన్ చేసి చెప్పడం, బన్ని కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో అఖిల్ రెండవ సినిమాకి అడ్డంకి తొలగినట్లు టాలీవుడ్ లో సమాచారం. మొత్తానికి బన్ని చేసిన త్యాగం వల్ల అఖిల్ రెండవ సినిమా సెట్స్ పైకి అతి త్వరలో రానుంది. ఈ సినిమా ‎విజయం పొందాలని ఆశిద్దాం.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.