రేసుగుర్రంలా దూసుకెడుతున్నాడు

ఈమధ్య టాలీవుడ్ హీరోల్లో కొందరు వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. మరికొందరు ఒక సినిమా పూర్తి కాకుండానే ఇంకో పిక్చర్ మొదలు పెట్టే సన్నాహాలు చేస్తున్నారు. ఇంకొందరు కాస్త గ్యాప్ తో కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నారు.  కాస్త గ్యాప్ తో  ఇటీవల వరస హిట్లు కొడుతున్న హీరో ఇప్పుడు ఏకంగా మూడు పిక్చర్స్ కు ప్లాన్ చేస్తున్నాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు యూత్ లో మాంఛి క్రేజ్ ఉంది. బన్నీ సినిమా చేస్తే ఇక తిరుగులేదు. ఫ్లాప్ అనే మాట ఉండదు. వరస హిట్లతో రేసుగుర్రంలా పరుగెడుతున్న ఈ హీరో ఈమధ్య సరైనోడు హిట్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. నెక్స్ట్ పిక్చర్ కోసం కొంత ప్లాన్ చేసుకున్నాక దాని గురించి న్యూస్ కూడా వచ్చింది.  అయితే ఇంకో  ఆశ్చర్యమైన సంగతి తెలిసింది.

సరైనోడు అల్లు అర్జున్ ఇప్పుడు ఒక సినిమా కాదు…ఏకంగా మూడు ప్రాజెక్ట్ లకు ప్లాన్ చేశాడు. అతను  రెండు మూవీస్ కు రెడీ అయ్యాడని తెలుసు. కానీ మూడో మూవీని కూడా ఓకే చేసినట్టు తెలుస్తోంది.అల్లు అర్జున్ ఇప్పటికే హరీష్ శంకర్ డైరెక్షన్ లో దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్నాడు. ఇకపోతే తమిళ దర్శకుడు లింగు స్వామితో  మరో సినిమా చేస్తున్నాడు.

ఒకవంక దువ్వాడ జగన్నాథం షూటింగ్ లో ఉండగానే లింగుస్వామి సినిమా కమిట్ అయ్యాడు బన్నీ. ఈ మూవీకి ప్రిపేరేషన్స్ అవుతున్నాయి.  అయితే ఈ రెండూ కాక వక్కంతం వంశీతో  బన్నీ ఇంకో ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.  గీతా ఆర్ట్స్ బ్యానర్ పై దీన్ని చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు లగడపాటి శ్రీధర్ ఈ సినిమాను తీస్తాడని తెలుస్తోంది. అన్నీ రెడీ చేసుకుని వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.