బోయపాటి కొత్త ట్రెండ్

ఒక్కో  డైరెక్టర్ తన మూవీస్ తో ఒక్కో రకమైన స్టాంప్ వేసుకుంటాడు. ఒక డైరెక్టర్ యాక్షన్ మూవీస్ తీస్తే, మరో డైరెక్టర్ రొమాంటిక్ సినిమాలు, ఇంకో డైరెక్టర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తీస్తారని పేరు తెచ్చుకుంటారు. అయితే, ఎప్పుడూ ఒకే ఫార్ములాలో సినిమాలు తీసే డైరెక్టర్లు కూడా ఒక్కోసారి రూట్ మారుస్తుంటారు. యాక్షన్ సినిమాలు తీసే ఓ స్టార్ డైరెక్టర్ రూట్ మార్చబోతున్నాడు. ఆ రూటేంటో తెలుసుకుందాం…

టాలీవుడ్ లో యాక్షన్ సినిమాలు తీసే డైరెక్టర్ ఎవరంటే…టక్కున గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. అతని మూవీస్ ఫుల్ గా యాక్షన్ స్పీడ్ తో నిండిపోయి ఉంటాయి. ఈ రోజుల్లో ఏ  హీరోకైనా ఇమేజ్  పెరగాలన్నా, స్టార్ డమ్ రావాలన్నా యాక్షన్ పిక్చర్ పడాలి. బోయపాటి సినిమాతో  సీనియర్ హీరోల ఇమేజ్ కూడా మరింత పెరిగింది ఇక యంగ్ హీరోలైతే చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలతో అమాంతం స్టార్ డమ్ తెచ్చేసుకున్నారు.

సరైనోడు సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ను మరింత పెంచాడు బోయపాటి. వరస హిట్స్ ఇస్తున్న  బోయపాటి శ్రీను తో సినిమా చేద్దామని చాలామంది అనుకొంటున్నారు. అయితే బోయపాటి మాత్రం  బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ తో  పిక్చర్ ప్లాన్ చేస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ఇదివరకు చేసిన రెండు సినిమాలూ సరిగా ఆడలేదు. అందుకే బోయపాటి అయితే హిట్ కొట్టొచ్చని బెల్లంకొండ కూడా ఆశతో ఉన్నాడు.

ఈసారి బోయపాటి ఎప్పటిలా యాక్షన్ మూవీని టేకప్ చేయడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ పిక్చర్ అయితే లేడీస్ ఎక్కువగా చూసే అవకాశం ఉందని, అలా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నిలబడే అవకాశం ఉందని బోయపాటి అనుకుంటున్నట్టు తెలిసింది. ఈ పిక్చర్ తర్వాత మెగాస్టార్ తో కూడా పిక్చర్ చేసే ఆలోచనలో ఉన్నాడు బోయపాటి.

Leave a Reply

Your email address will not be published.