సక్సెస్ కు చిరునామా షారూఖ్

కొందరి పేర్లు దేశమంతటా మోగిపోతాయి. వాళ్ల పేరు చెబితే చాలు ..  చిన్నపిల్లలు కూడా గుర్తుపడతారు. ఈ గ్లామర్ సినీ తారలకు, క్రికెటర్లకూ సొంతం. నిజం చెప్పాలంటే మన దేశంలో వీరికున్నంత పేరు మరే రంగంలో వారికీ లేదనే చెప్పాలి. చిన్న పిల్లలకు సైతం తెలిసిన అలాంటి సెలెబ్రిటీస్ లో షారుఖ్ ఖాన్ హై ర్యాంక్ లో ఉన్నాడు. నవంబర్ 2 షారుఖ్ ఖాన్ బర్త్ డే.

అమితాబ్ బచ్చన్ తర్వాత  అంతటి పాపులారిటీ ఉన్న యాక్టర్ ఎవరంటే .. .. ఎవరైనా షారుఖ్  పేరే చెబుతారు. అందుకే అతన్ని బాలీవుడ్ బాద్ షా అంటారు. కింగ్ ఆఫ్ బాలీవుడ్ అని, కింగ్ ఖాన్ అని కూడా షారుఖ్ కు నిక్ నేమ్స్ ఉన్నాయి. 

హీరో అంటే  పెద్ద పర్సనాలిటీ ఉండాలి. చూడగానే వాహ్ అనిపించాలి. కానీ   షారుఖ్ ఖాన్ కు అలాంటి పర్సనాలిటీ లేదు కానీ .. .. వాహ్ అని మాత్రం అనిపించాడు. మొదట టీవీ సీరియల్స్ తో ఆడియన్స్ కు పరిచయమైన షారుఖ్ 1992లో దీవానా తో మూవీ కెరీర్ స్టార్ట్ చేశాడు.  ఆ తర్వాత వరస హిట్లు కొట్టాడు.  అతను యాక్ట్ చేస్తే సక్సెస్ గ్యారెంటీ అనే పేరు తెచ్చుకున్నాడు.

షారుఖ్ ఖాన్ చేసిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ మాత్రమే కాదు .. థండర్ సక్సెస్ అయ్యాయి. ఒకే థియేటర్ లో ఏడాది పాటు ఆడిన సినిమాలూ  ఉన్నాయి. బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, మొహబ్బతే, దిల్ తో పాగల్ హై,  కుచ్ కుచ్ హోతా హై అతనికి రొమాంటిక్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టాయి. తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నాడు కింగ్ ఖాన్.  ముఖ్యంగా కాజోల్ తో చేసిన సినిమాలతో . . . వాళ్లిద్దరికీ హిట్ పెయిర్ అనే పేరొచ్చింది. చక్ దే ఇండియా, మై నేమ్ ఈజ్ ఖాన్, మూడేళ్ల కిందట వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీస్ లో షారుఖ్  కామెడీని కూడా పండించాడు.

షారుఖ్ ఖాన్ రొమాంటిక్  రోల్స్ మాత్రమే కాదు … ట్రాజెడీ, కామెడీ కేరక్టర్స్ కూడా  చేస్తున్నాడు.  బాలీవుడ్ లో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కింగ్ ఖాన్ ను ఇప్పట్లో  క్రాస్ చేసేవారు లేరనే చెప్పాలి. బాలీవుడ్ బాద్ షాకు  బర్త్ డే విషెస్.

Leave a Reply

Your email address will not be published.