ఎవర్ గ్రీన్ యాక్టర్ అమితాబ్

మన దేశంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను తెలీనివారుండరు. ఇది అతిశయోక్తి కాదు, నిజం. మన దేశంలోనే కాదు… ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలున్నాయి. ప్రపంచమంతటా ఆయనకు కోట్లాది మంది అభిమానులున్నారు. భారతీయ చలనచిత్రరంగంలో అమితాబ్ ఒక లెజెండ్. అక్టోబర్ 11 అమితాబ్  బచ్చన్ పుట్టిన రోజు. బిగ్ బీ బర్త్ డే కి బెస్ట్ విషెస్

భారతీయ సినిమాకు అమితాబ్ బచ్చన్  ట్రెండ్ సెట్టర్. అమితాబ్ వచ్చాక ఇండియన్  సినిమా ఒక మలుపు తిరిగింది. సినిమా చరిత్రను తీసుకుంటే అమితాబ్ కు ముందు, అమితాబ్ వచ్చిన తర్వాత అని డివైడ్ చేసి డిసైడ్ చేయవచ్చు. బిగ్ బి వచ్చాక బాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో ఒక టర్నింగ్ వచ్చింది. మూవీ ప్రెజెంటేషన్ లోను,  ఫైట్స్ లోనూ స్పీడ్ పెరిగింది.

అమితాబ్ అసలు పేరు చాలామందికి తెలీదు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో పుట్టిన అమితాబ్ కు మొదట ఇంక్విలాబ్ అనే పేరు పెట్టారు. అమితాబ్  పూర్తి పేరు అమితాబ్ హరివంశ్ రాయ్ శ్రీవాత్సవ బచ్చన్. సినిమాల్లోకి వచ్చాక ఆ పేరు అమితాబ్ బచ్చన్ గా మారింది. చాలామందిలాగే అమితాబ్ కూడా సినిమాల్లోకి రావడానికి చాలా కష్టాలు పడ్డాడు. మొదట్లో ఆయనను అసలు సినిమాలకే పనికిరావు పొమ్మన్నారు.

ఎన్నో ప్రయత్నాలు చేయగా అమితాబ్ కు సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత అదృష్టం కలిసొచ్చింది. అమితాబ్  గంభీరమైన స్వరం ఆయనకు వరంగా మారింది.  తన కెరీర్ లో మంచి పాత్రలు, మంచి చిత్రాలురావడం అమితాబ్  అదృష్టమే అనాలి. రచయితలు సలీం -జావేద్ లు అమితాబ్ ను దృష్టిలో ఉంచుకొని అద్భుతమైన కథలు తయారు చేశారు. ఆ కథలు థ్రిల్లింగ్ గా, చిల్లింగ్ గా ఉండేవి.

అమితాబ్  సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో అప్పటి హీరోలు రొమాంటిక్ కేరక్టర్లకే పరిమితమయ్యారు. అమితాబ్  ఒక్కసారిగా యాక్షన్ హీరోగా దూసుకొచ్చాడు.  యాక్షన్ థ్రిల్లర్స్ బచ్చన్ కు బాగా ఎడ్వాంటేజ్ అయ్యాయి.  యాక్టింగ్ లో అమితాబ్ స్పీడ్ ఆడియన్స్ ను కట్టిపడేసింది.  అంతే… అమితాబ్ కు యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అమితాబ్ కు కాంపిటీషన్ అనేది లేదు.

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సినీజీవితంలో ఎన్నో మైలురాళ్లున్నాయి. అద్భుతమైన కేరక్టర్స్ వచ్చాయి. 74 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ కుర్రాళ్లతో సమానంగా యాక్ట్ చేస్తున్నాడంటే …అది ఆయనకే సాధ్యమైన ఫీట్. ఇప్పట్లో అమితాబ్  ప్లేస్ ను మరొకరు ఆక్రమించే ప్రసక్తే లేదు. ఆయనకు  మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published.