నల్లధనం థీమ్ తో బిచ్చగాడు-2 

ఈ మధ్యకాలంలో తెలుగులో ఘనవిజయాన్ని సాధించిన అనువాద చిత్రాల్లో బిచ్చగాడు ముందు వరుసలో కనిపిస్తుంది. అగ్రకథానాయకుల సినిమాలతో సమానంగా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. సహజత్వానికి దగ్గరగా వుండే కథా కథనాలు ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని తెచ్చిపెట్టాయి.ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ఓ చిత్రాన్ని స్టార్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.

ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదలై సంచలనాలు సృష్టించిన సినిమా బిచ్చగాడు. కేవలం మౌత్  పబ్లిసిటీతో ఈమధ్య కాలంలో వందరోజులు పూర్తిచేసుకున్న సినిమాబిచ్చగాడు! దీంతో అటు కోలీవుడ్ – ఇటు టాలీవుడ్లలో ఈ సినిమా చేసిన హడావిడి చాలామందికి పెద్దషాకే ఇచ్చింది. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ చూసి బడా నిర్మాతలు సైతం ఆశ్చర్యపోయారనే చెప్పాలి. ఈ మూవీలో హీరోగా చేసిన విజయ్ఆంటోనీకి మాస్ లో విపరీతమైన క్రేజ్ వచ్చేసి తెలుగులోనూ డైరెక్ట్ మార్కెట్ ఏర్పడిపోయింది.

ఇంతకు ముందు తెలుగులో విడుదలయిన రెండుచిత్రాల్లో రాని గుర్తింపు ఒక్క బిచ్చగాడుతో వచ్చింది విజయ్‌ ఆంటోనికి.స్వతహాగా సంగీతదర్శకుడు కూడా కావడంతో పాటలుకూడా సూపర్ హిట్ అయివిజయ్ఆంటోనీకి మంచిపేరొచ్చింది. ఈ క్రమంలో “బిచ్చగాడు”కి సీక్వెల్ చేస్తున్నాడట విజయ్ఆంటోనీ. ఈ బిచ్చగాడు పార్ట్-2లో నల్లధనం అంశాన్ని టచ్ చేయబోతున్నాడని టాక్! ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం దేశం మొత్తంమీద పెద్దనోట్లరద్దు అనంతరం నల్లధనంపై విపరీతమైన చర్చ నడుస్తున్న నేపథ్యంలో…అదే కంటెంట్ ను పట్టుకొని సినిమాతీయాలనుకోవడం గొప్పవిషయమే. బిచ్చగాడు ఇచ్చిన నమ్మకంతో దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో  బిచ్చగాడు-2 ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఎలాగూ ఇప్పటికే తెలుగు – తమిళంలో డైరెక్ట్ మార్కెట్ ఉన్న ఈ విజయ్ఆంటోనీ సినిమాని మలయాళం – కన్నడలోనూ విడుదలచేయాలని చూస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.