కరెన్సీ రద్దు చేయమన్న ‘బిచ్చగాడు’

బ్లాక్ మనీని, దొంగ నోట్ల  చలామణీని నియంత్రించేదుకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు హర్షిస్తుంటే మరికొందరు విమర్శస్తున్నారు. ఆయన తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం అందరిని షాక్ కి గురిచేసింది. అయితే మోడీ తీసుకున్న ఆ నిర్ణయం వెనుక ఎవరున్నారో ఎవరున్నారో తెలీదుకాని మొన్నీమధ్య వచ్చిన  ఓ సినిమా సన్నివేశం మాత్రం సిట్యుయేషన్ కి సరిగ్గా సరిపోయింది.

భారత దేశంలో పెద్దనోట్లను బ్యాన్ చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం అందరి మన్ననలను అందుకుంటోంది.అయితే ఈ డెసిషన్ తీసుకోవడం వెనుక  చాలా కారణాలు వున్నా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. బిచ్చగాడు సినిమాలో నల్లధనం వెలికి తీయడానికి ఏంచేయాలో ఓ బిచ్చగాడు చెప్పిన సీన్ చక్కర్లు కొడుతోంది.

ఇటీవల వచ్చిన విజయ్ ఆంటోనీ మూవీ.. బిచ్చగాడు లోని ఓ రేడియో జాకీని ఉద్దేశించి ఓ బెగ్గర్.. ప్రభుత్వం 500, వెయ్యి నోట్లను రద్దు చేస్తే బ్లాక్ మనీ, ఫేక్ నోట్ల బెడద చాలావరకు తగ్గుతుందని అంటాడు. ఇప్పుడు ఆ డైలాగ్..ఆ సీన్ మీడియాలో వైరల్ గా పాకిపోయాయి.  ఇది కాకతాళీయంగా జరిగి ఉండచ్చు కానీ ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యకు సరిగ్గా సరిపోయింది.

Leave a Reply

Your email address will not be published.