విష్ణుతో మరోసారి భక్త కన్నప్ప

సినిమాల పరంగా కొన్ని క్రేజీ ప్రాజెక్టులుంటాయి. అవి చేయాలని నటీనటులు, దర్శకులు తహతహలాడుతుంటారు. మొదట ఎవరో ఒకరు తను ఆ మూవీ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ప్రకటిస్తారు. అంతలోనే ఆ ప్రాజెక్ట్ తను చేస్తానని మరొకరు అనౌన్స్ చేస్తారు. అలా చేతులు మారి మారి ఆ సినిమా చివరికి ఒకరి చేతుల్లో పడుతుంది. టాలీవుడ్ లో ఓ సినిమా వ్యవహారం కూడా అలాగే నడిచింది. ఎట్ లాస్ట్ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఓ ప్రముఖ డైరెక్టర్ చేతికొచ్చింది.

కొన్ని పాత్రలు చిరస్మరణీయంగా ఉంటాయి. వేమన, రామదాసు, త్యాగయ్య, అన్నమయ్య, పోతన, అల్లూరి సీతారామరాజు, కన్నప్ప వంటి ఎన్నో ఉన్నతమైన  పాత్రలు  చేయాలని కొందరికి బలమైన కోరికుంటుంది.కానీ ఏవో అవాంతరాలు ఎదురై చేయలేకపోతారు. మరెవరో చేస్తారు. ఆ కేరక్టర్స్ లో వారు జీవిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత అవే కేరక్టర్స్ తో మరొకరి మళ్లీ ఆ సినిమాలు  తీస్తుంటారు.

చాలాకాలం కిందట కృష్ణంరాజు తో భక్తకన్నప్ప సినిమా వచ్చింది. ఆ సినిమాలో కృష్ణంరాజు అద్భుతంగా చేశాడు.  అదే సినిమాను మళ్లీ తీయాలని ఈమధ్య కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ జనరేషన్ హీరోల్లో కన్నప్ప కేరక్టర్ ను  ప్రభాస్ చేస్తాడని ప్రచారం జరిగింది. అంతలోనే సీన్ మారింది. తను సునీల్ తో కన్నప్ప తీస్తానని తనికెళ్ల భరణి ప్రకటించాడు. అంతేకాదు… కన్నప్ప పై మంచు విష్ణు కూడా కన్నేసి తనే చేస్తానన్నాడు.

మంచు విష్ణు కన్నప్పగా చేసే ఆ సినిమాను తనికెళ్ల భరణి డైరెక్ట్ చేస్తాడని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు అవేవీ జరగలేదు.  అలా కన్నప్ప సినిమా చాలా చేతులు మారి ఇప్పుడు  డైరెక్టర్ కృష్ణవంశీ చేతికి రాబోతోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం సందీప్ కిషన్ తో నక్షత్రం మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత బాలకృష్ణతో  రైతు చిత్రం చేయాలి. దీనికి రెడీ అవుతున్న  కృష్ణవంశీ ఆ మూవీ అయ్యాక విష్ణుతో  కన్నప్ప సినిమా కూడా చేస్తాడట.

Leave a Reply

Your email address will not be published.