శాతకర్ణి సంపూర్ణ రూపంలో బాలకృష్ణ

ఒక సినిమా వస్తోందంటే ఆ మూవీ చేస్తున్న హీరోనే కాదు .. .. అతని అభిమానులు కూడా చాలా ఆశలు పెంచుకుంటారు. ఊహలు అల్లుకుంటారు. స్టార్ హీరో మూవీ కైతే ఇంక చెప్పక్కర్లేదు. ఆ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంపైనా అభిమానం పెంచుకుంటారు. అపురూపంగా భావిస్తారు. అలాంటి విశేషం ఒకటి జరిగింది.

నటసింహం  బాలకృష్ణ నటిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో  అతని పాత్ర ఎలా ఉంటుంది, ఆహార్యం ఎలా ఉంటుంది అన్న అంశంపై కొన్ని ఊహాగానాలు సాగుతున్నాయి. ఆ పాత్ర  వేషధారణతో బాలకృష్ణ కొన్ని ఫోటోల్లో కనిపించినా … పూర్తి ఆహార్యంతో  కనిపించలేదు. ఇప్పుడు శాతకర్ణి పూర్తి స్వరూపంతో  ఫోటోలు విడుదలయ్యాయి.

గౌతమీపుత్ర శాతకర్ణిలో  బాలకృష్ణ వేషధారణ ఇలా ఉంటుంది అని తెలిపే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రం చిత్రీకరణ చాలావరకు పూర్తయినా .. .. అసలు శాతకర్ణి రూపం ఎలా ఉంటుంది, వేషధారణ ఎలా ఉంటుంది అనేది ఇప్పటివరకు వెల్లడి కాలేదు.

తాజాగా విడుదలైన శాతకర్ణి అసలు రూపానికి సంబంధించిన ఛాయాచిత్రాలు  బాలయ్య అభిమానుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ లో శాతకర్ణి రాజసూయ యాగం చేసే సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఆ సన్నివేశాల్లో శాతకర్ణిగా  బాలకృష్ణ సంపూర్ణమైన ఆహార్యంలో కనిపించాడు. అంతకు ముందు వరకు శాతకర్ణి సంపూర్ణ స్వరూపం ఎవరికీ తెలీదు.

శాతకర్ణి వేషంలో తమ అభిమాన కథానాయకుడు బాలకృష్ణను చూసిన అభిమానులు  ఆయనను భైరవద్వీపంలోని బాలయ్యతో  పోలుస్తున్నారు.  ఇంతకాలానికి మళ్లీ ఆ స్థాయి పాత్రలో, అలాంటి రూపంలో కనిపిస్తున్నాడని ప్రశంసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.