బాలకృష్ణ దసరా హోమం

తమ రాజ్యం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అదివరలో రాజులు క్రతువులు నిర్వహించేవారు. వానలు పడితే పంటలు పండుతాయి. పంటలు పండితే తినడానికి తిండి ఉంటుంది. దేశం సస్యశ్యామలమవుతుంది. ఇది అనూచానంగా వస్తూంది. నేడు కూడా ఆ సంప్రదాయం కొనసాగుతోంది. యజ్ఞయాగాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంప్రదాయం సినిమా వారిలో కూడా ఉంది.

పూర్వం రాజులు యాగాలు, హోమాలు చేసేవారు. ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం కూడా రాజు, రాజ్యానికి సంబంధించిన కథే. పైగా ఇది ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న 100వ సినిమా. ఈ చిత్రం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్న బాలయ్య … శుభం జరగాలని ఆశిస్తూ యజ్ఞం చేస్తున్నాడు.

ప్రస్తుతం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం షూటింగ్‌లో తీరిక లేకుండా ఉన్నా విజయదశమి చాలా పర్వదినం కనుక తీరిక చేసుకుని యజ్ఞాలు హోమాల్లో నిమగ్నమయ్యాడు.  ఇలా చేయడం తనకు, తన సినిమాలకు ఎంతో కలిసొస్తుందని అనుకుంటున్న బాలయ్య తన సతీమణితో సహా హోమం చేయించాడు. నిత్యం చేసే పూజలతోబాటు, భక్తి ప్రపత్తులతో ఇలాంటివి చేయడం చాలా మంచిదని చెబుతున్నాడు బాలకృష్ణ.

సామాన్యంగా బాలకృష్ణ విజయదశమినాడు  దుర్గా పూజ చేస్తాడు. అయితే ఈసారి రెండు రోజుల ముందుగానే తన కుటుంబ సభ్యులతో కలిసి హోమం చేయడం చెప్పుకోదగ్గ విశేషం. బాలకృష్ణకు భక్తి ప్రపత్తులు ఎక్కువ. పైగా తను ఇప్పుడు చారిత్రక చిత్రంలో నటిస్తున్నాడు. కాబట్టి ఆ సినిమా విజయాన్ని కోరుతూ హోమం చేశాడని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.