పింక్ రిబ్బన్ వాక్ లో బాలకృష్ణ

క్యాన్సర్ పై యుద్దం చేయడంలో టాలీవుడ్ స్టార్ బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటాడు. బసవతారకం ఆసుపత్రి నుండి ఎంతో మందికి క్యాన్సర్ చికిత్స అందిస్తున్నాడు. ఈ రోజు ఉదయం జరిగిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ కార్యక్రమంలో బాలకృష్ణ, ఎంపీ కవిత పాల్గొని మహిళలు ఈ వ్యాధిపట్ల అవగాహన కలిగి వుండాలని, తొలిదశలోనే క్యాన్సర్ ని గుర్తించాలని  తెలిపారు.

క్యాన్సర్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని బాలకృష్ణ అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన పింక్ రిబ్బన్ వాక్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు.తొలిదశలో బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తిస్తే వైద్యం చాలా సులభమని, తమ బసవతారకం ఆసుపత్రిలో అతి తక్కువ ఖర్చుకే ఉన్నతస్థాయి వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు.

పింక్ రిబ్బన్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ క్యాన్సర్ కొందరిలో వారసత్వంగా వస్తుందని, మరి కొందరిలో మధ్యలో వస్తుందని అన్నారు.. బసవతారకం ఆసుపత్రిలో ఈ వ్యాధికి అన్ని రకాల చికిత్సలూ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఇది ఉన్నదే పేదలకోసమని పేర్కొన్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్ ముదిరేవరకు చాలామంది గుర్తించలేకపోతున్నారని, దీని చికిత్సకు చాలా డబ్బు ఖర్చవుతుందని ముఖ్యంగా గ్రామీణ మహిళలు భావిస్తున్నారని బాలయ్య అన్నారు. కానీ బసవ తారకం ఆసుపత్రిలో అలాంటిదేమీ లేదని, అది కట్టిందే పేదలకోసమని చెప్పారు. తన తల్లి క్యాన్సర్ తోనే మరణించారని, ఆమె స్మారకంగానే ఈ హాస్పిటల్ నిర్మించామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నటి మంచు లక్ష్మి కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.