బాహుబలి-2తో షారూఖ్ మూవీ ఢీ

సినిమాల మధ్య పోటీ విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోస్ నటించే సినిమాలకైతే ఇంక చెప్పక్కర్లేదు. మేకింగ్ స్టేజ్ నుంచే మొదలయ్యే ఈ కాంపిటీషన్ రిలీజ్ టైం వచ్చేసరికి పీక్ లెవెల్ కు చేరుకుంటుంది. బాలీవుడ్ లో ఇప్పుడు రెండు పెద్ద సినిమాల రిలీజ్ లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.

బాలీవుడ్ లో బిగ్ హీరోల సినిమాల రిలీజ్  హై పిచ్ లో ఉంది,  రిలీజ్ లోనూ, ఆ తర్వాత రన్నింగ్ లోనూ  రకరకాల ప్లాన్స్  వేస్తుంటారు.  తన కాంపిటీటర్ ను పడగొట్టడానికి పథకాలు వేస్తుంటారు. షారుఖ్ ఖాన్ నటించిన రాయిస్ సినిమా సక్సెస్ కు ఇప్పుడు  డిస్ట్రిబ్యూటర్స్ ఓ కొత్త ఐడియా వేశారు. థియేటర్లకు కండిషన్ పెట్టారు.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన  రాయిస్  వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కి విడుదల అవుతుంది. ఈ  మూవీ పై ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.  రాయిస్ ను తీసుకున్న పంపిణీదారులే బాహుబలి -2 ను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రాయిస్ మూవీ షారుఖ్ ఖాన్ మూవీ కాబట్టి అది ఘన విజయం సాధించాలనే ప్లాన్ వేశారు.

బాహుబలి- 2ను సింగిల్ స్క్రీన్ పైనే రిలీజ్ చేయాలని థియేటర్ల ఓనర్లకు పంపిణీదారులు షరతు పెట్టారు. బాహుబలి -2 ను వదులుకోలేని థియేటర్ యజమానులు ఈ కండిషన్ కు సరే అని అనాల్సి వచ్చిందట. బాహుబలిని  సింగిల్ స్క్రీన్ పైనే  రిలీజ్ చేస్తే రాయిస్ ముందు ఈ సినిమా కలెక్షన్స్ తక్కువగా ఉంటాయని, షారుఖ్ పిక్చర్ బ్లాక్ బస్టర్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన.

Leave a Reply

Your email address will not be published.