68 దాటిన అందగత్తె

మేకప్ లేకపోయినా కొందరు తారామణులు నింగిలోని తారల్లా ప్రకాశిస్తుంటారు. వారు ఎక్కడుంటే అక్కడ చుట్టూ అందాలు విచ్చుకుంటాయి. ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. ఆ అందానికి ఆ ప్రదేశం బృందావనమే అవుతుంది. అందానికి నిర్వచనంలా సొగసులీనుతుంటారు. అలా అందమంతా ఒక్క చోట రాశిపోశారా అనిపించే నటి హేమమాలిని. అందుకే ఆమె డ్రీం గాళ్ అయింది. రేపు (అక్టోబర్ 16) హేమమాలిని పుట్టిన రోజు. ఆమెకు ప్రైమ్ పోస్ట్ బర్త్‌ డే విషెస్ చెబుతూ ఈ స్పెషల్ స్టోరీనీ చదవండి.

కాలేజీ అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. అబ్బాయిలకు గాళ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరి లవర్స్ వాళ్లకుంటారు. డ్రీం గరల్స్, డ్రీం బాయిస్ కూడా ఎవరికి వాళ్లకుంటారు. ఇది క్వైట్ నేచురల్. కానీ దేశంలో యూత్ అంతటికీ ఒకే ఒక డ్రీం గాళ్ ఉంది. ఆమే హేమమాలిని. అసలు దక్షిణాది నటీమణుల్లోనే ఏదో స్పెషల్ ఎట్రాక్షన్ ఉంది. ఆనాటి వహీదా, వైజయంతిమాల, రేఖ, హేమమాలిని వీరంతా సౌత్ నుంచి వెళ్లినవారే.

ఎన్నేళ్లయినా, దశాబ్దాలు గడిచినా అందాన్ని కాపాడుకోవడం అందరివల్లా అయ్యేది కాదు. హేమమాలిని లాంటి వాళ్లకే అది సాధ్యమవుతుంది. 68 ఏళ్ల వయసులో కూడా హేమ ఆ హేమంలా మిలమిలా మెరిసిపోతోంది. సినిమాల్లోకి వచ్చి 45 ఏళ్ల పైగా అయినా ఆమెను చూస్తే అన్నేళ్లయిందా అనిపిస్తోంది. లేటెస్ట్ గా గౌతమీపుత్రశాతకర్ణి లో నటిస్తున్న హేమమాలినిని చూస్తే రాజసం, ఠీవి కొట్టొచ్చినట్టు కనబడతాయి.

బాలీవుడ్ లెజెండ్ రాజ్ కపూర్ ఫైండర్ హేమమాలిని. ఆయన మూవీ స్వప్నోం కా సౌదాగర్ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది. ఆ సినిమాలో హేమమాలినిని చూసి చాలామంది హృదయాలు పోగొట్టుకున్నారు. కొందరు హీరోలు కూడా ఆమెను చూసి పరవశించిపోయారు. అందమొక్కటే కాదు అందుకు సమానస్థాయిలో నటన కూడా ఆమెలో ఉంది. ఆమె నటించిన చిత్రాలు చాలావరకు 100 రోజులు ఆడినవే.

బాలీవుడ్ లో అందానికి డెఫినిషన్ ఎవరంటే  హేమమాలిని. వన్నె తరగని ఆ అందం. ఇప్పటికీ కుర్రకారుకు ముందరి కాళ్ల బంధమే. హేమమాలిని బర్త్ డే సందర్భంగా ఆమెకు మరోసారి ప్రైమ్ పోస్ట్ శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published.