ఏదైనా ఓకే

కొందరు నటులు మంచి కేరక్టర్ కోసం చూస్తారే తప్ప కేవలం హీరోగానే చేస్తాను అని గిరిగీసుకొని కూర్చోరు. అలాంటి నటుడు రానా. అతను యాక్ట్ చేస్తున్న పాత్రలు చూసిన ఎవరైనా ఈ సంగతి ఒప్పుకొంటారు. హీరోగా వచ్చిన నటుడు మరో కేరక్టర్ చేసేందుకు ఇష్టపడడు. కానీ రానా అలాంటి పట్టింపులు పెట్టుకోలేదు.  విలన్ గా కూడా చేశాడు. అంతేకాదు…ఒక్క తెలుగు సినిమాలకే పరిమితం కాలేదు. తమిళం, బాలీవుడ్ పిక్చర్స్ కూడా చేస్తున్నాడు.

కెరీర్ మొదట్లో లీడర్ లో లీడ్ రోల్ చేసిన రానా ఆ తర్వాత విలక్షణమైన కేరక్టర్స్ ఎంచుకుంటున్నాడు. బాహుబలిలో చేసిన కేరక్టరే అందుకు నిదర్శనం. నిజానికి రానా హీరోగా చేసింది చాలా తక్కువే.  చాలా గ్యాప్ తర్వాత  డైరెక్టర్ తేజ  తీస్తున్న  నేనే రాజు – నేనే మంత్రి సినిమాలో రానా హీరోగా చేస్తున్నాడు. తేజ  సినిమాలో ఏదోక ప్రత్యేకత ఉంటుంది. బహుశ ఈ కారణం వల్లే రానా హీరోగా చేయడానికి ఒప్పుకొని ఉండవచ్చు.

తేజ సినిమాలో రానా చేయడం ఒక విశేషమైతే, టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా యాక్ట్ చేయడం మరో విశేషం. కొన్నేళ్ల కిందట తేజ తీసిన లక్ష్మీ కళ్యాణం సినిమాతోనే  కాజల్ టాలీవుడ్ కు పరిచయమైంది. మళ్లీ ఇంతకాలానికి ఆయన పిక్చర్ లో చేయబోతోంది.  తేజ- రానా – కాజల్ కాంబినేషన్ లో మొదటిసారి ఓ సినిమా  రాబోతోంది. ఈ ముగ్గురికీ ఒక్కో స్పెషాలిటీ ఉంది కాబట్టి పిక్చర్ కూడా వెరైటీగానే ఉండొచ్చు. ఈ పిక్చర్ కు తేజ నిర్మాత కూడా. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి మరి.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.