అనుష్క పెళ్ళట…

మూడుపదుల వయసు పైబడిన నటీమణులకు ఇంటాబయట పెళ్లి ఒత్తిడి పెరగడం సర్వసాధారణం. 34 ఏళ్ల నటి అనుష్కకు అలాంటి తాకిడి ఉంటుందనడం అనూహ్యమేమీకాదు. ఉన్నతవిద్యను పూర్తిచేసిన అనుష్క ఆదిలో యోగాశిక్షణ పొంది, తర్వాత యోగాటీచర్‌గా పలువురికి శిక్షణ ఇచ్చారు. అలాంటి బ్యూటీని విధి నటిని చేసింది. అనుష్క 2005లో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిన అనుష్కకు త్వరలో కళ్యాణగఘడియలు రాబోతున్నాయని తెలుస్తోంది.

తెలుగు ఇండస్ట్రీలోకి  సూపర్ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు బ్యూటీ అనుష్క.  ఆ తర్వాత అగ్రహీరోల సరసన ఛాన్స్ రావడం ఈ అమ్మడికి బాగా కలిసివచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పెద్దహీరోలతో నటిస్తూ..విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. అంతేకాదు, అనుష్కలో మరోప్రత్యేకత కూడా ఉంది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ చేయని ప్రయోగం ఈ అమ్మడు చేస్తూ ఇండస్ట్రీలో మంచిపేరు సంపాదించింది.

అనుష్క అరుంధతి, పంచాక్షరి, రుద్రమదేవి, సైజ్జీరోలాంటి  లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ఆల్‌ రౌండర్ అనిపించుకుంది. ఇక అనుష్క పెళ్లివిషయంపై కొంతకాలంగా రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి.  ఇప్పటికే  ఈ అమ్మడికి 34 ఏళ్ళురాగా ఇంట్లోవాళ్ళు పెళ్లి అంటూ పోరుపెడుతున్న నేపథ్యంలో పెళ్లికిఒప్పుకున్నట్లు తెలుస్తోంది.  ఆ మద్య సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాతతో వివాహం జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే అనుష్క పెళ్లి వచ్చే ఏడాదిమాత్రం తప్పకుండా ఉంటుందట .

అనుష్కను ఇప్పటికే పలువురితో లింకు పెడుతూ రకరకాలకథనాలు వస్తున్నాయి.ప్రస్తుతం అనుష్క బాహుబలి 2, భాగమతి , ఓంనమోవేంకటేశాయ , సింగం 3 చిత్రాలుచేస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత హైదరబాద్ కు చెందిన ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ బిజినెస్ మ్యాన్ ఎవరూ అనేది కాస్త సీక్రెట్ గా ఉన్నా.. రెండు కుటుంబాల మద్య అన్ని వ్యవహరాలు పూర్తైనట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.