అనుష్క ఒక వ్యాపార ప్రముఖుని పెళ్లి చేసుకోబోతోందట!

హైదరాబాద్: అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి ఫేమ్ అనుష్క ఒక వ్యాపారప్రముఖుని పెళ్లి చేసుకోబోతోందని తెలుస్తోంది. ఆ వ్యాపారప్రముఖుడు రకరకాల వివాదాలకు కేంద్రంగా ఈమధ్య వార్తలకు ఎక్కుతూ వచ్చాడు కూడా. ఎంతోమంది హీరోయిన్లతో స్నేహంగా మెలిగే ఒక టాలీవుడ్ హీరో అనుష్కను ఆ వ్యాపార-పారిశ్రామికవేత్తకు పరిచయం చేశాడని కూడా సమాచారం. మీడియా పరిశ్రమలోకి కూడా పెద్ద ఎత్తున అడుగుపెట్టిన ఈ వ్యాపారవేత్త ఈమధ్యనే తన కూతురుని మరో పెద్ద వ్యాపారవేత్త మనవడికి ఇచ్చి పెళ్లి చేసి తనకు లైన్ క్లియర్ చేసుకున్నాడని అంటున్నారు. 

ఆకట్టుకునే విగ్రహం కలిగిన ఈ 55 ఏళ్ల వ్యాపారప్రముఖుడు 30 ఏళ్ళు దాటిన అనుష్కతో ఈ మధ్య తరచు కలసి తిరుగుతున్నాడు. ఈ మధ్యనే ఈయన తన భార్యకు విడాకులిచ్చాడు. ఈ మధ్యకాలంలో రకరకాల ఒడిదుడుకులతో, ఎత్తుపల్లాలతో సతమమవుతున్న ఈ వ్యాపార ప్రముఖుని జీవితంలో ప్రస్తుతం అనుష్క సహచర్యమే వెలుగు నింపుతోందని సన్నిహితులు అంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published.