ఏయన్నార్ తో సినిమా

మహానటులు మరణించినా కూడా చిరస్మరణీయులు. వారి నటన, వారి సినిమాలు ఆణిముత్యాలు. ఎంతకాలం గడిచినా, వారి తర్వాత ఎందరు వచ్చినా వారి స్థానం మాత్రం పదిలం. అలాంటి లెజెండ్ యాక్టర్స్ మరణించినా వారు మళ్లీ బతికొస్తే ఎంత బాగుంటుంది అనుకునేవారు ఎందరో ఉన్నారు. ఈమధ్య కొన్ని సినిమాల్లో మళ్లీ వారు కనిపించేలా చేస్తున్నారు. అది నిజంగా విచిత్రమే.

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మళ్లీ మరో సినిమాలో నటించబోతున్నాడు. మరణించిన నాగేశ్వరరావు మళ్లీ ఎలా నటిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ లేటెస్ట్ టెక్నాలజీతో  ఆ అసాధ్యాన్ని  సుసాధ్యం చేయబోతున్నారు.  నాగార్జున-కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న ఓం నమో వేంకటేశాయ చిత్రంలో దివంగత నాగేశ్వరరావును ఒక పాత్రకోసం ఎంచుకున్నారు. 

అదెలా అనే సందేహం రావచ్చు. నాగేశ్వరరావు పాత్రను గ్రాఫిక్స్ తో క్రియేట్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమాలో నాగేశ్వరరావును చూపించడానికి కారణం ఉంది. అదివరకు నాగార్జున నటించిన అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలకు నాగేశ్వరరావు సలహాల్ని తీసుకున్నారు. ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ లో ఆయనను చూపించబోతున్నరు.

చనిపోయిన వాళ్లను మళ్లీ సినిమాల్లో చూపించే ప్రక్రియతో కన్నడంలో రూపొందిన మరో  సినిమా నాగరహావు. మరణించిన కన్నడ హీరో విష్ణువర్ధన్ ను ఈ సినిమాలో గ్రాఫిక్స్ తో చూపిస్తున్నారు. గ్రాఫిక్స్ మాయాజాలం చేసే కోడి రామకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

ఇదొక రేర్ ఫీట్ అంటున్నారు. ఇక కోలీవుడ్ లో కూడా ఈ ప్రయోగం జరిగింది. తమిళ్ లో లెజెండ్ హీరో ఎంజి రామచంద్రన్. ఎంతోకాలం కిందటే మరణించిన ఆ మహానటుడిని డిజిటల్ ఎఫెక్ట్స్ తో మళ్లీ తెరమీదికి తెచ్చారు. అలా రూపొందించిన ఆయిరతిల్ ఒరువన్ అనే మూవీ తమిళనాడులో 175 రోజులు ఆడి సెన్సేషన్ అయింది.

Leave a Reply

Your email address will not be published.