దీపావళి రోజు దుమ్ము రేపుతాట్ట

మనం బాగా సంతోషంగా జరుపుకొనే పండగ దీపావళి. దసరాను సరదాగా జరుపుకొంటే దీపావళిని ఆనందంగా జరుపుకొంటారు. మనమే కాదు .. .. తెరమీద తళుకులీనే తారలు కూడా ఫుల్ హ్యాపీగా దీపావళి వేడుక చేస్తారు. ఈ పండగకు సంబరాల సందడి ఇంతా అంతా కాదు.  అమితాబ్ బచ్చన్ ఇంట్లో ఈ దీపావళి ధూం ధాంగా జరుగుతుందట.

సామాన్యంగా  ఒక వయసు వచ్చాక పండగల మీద ఉత్సాహం తగ్గుతుంది. కానీ దీపావళి విషయమే డిఫరెంట్. యువకులే కాదు… వయసు దాటిన వారూ ఉత్సాహంగా దీపావళి చేస్తారు.  కానీ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అలా కాదు. 74 ఏళ్ల అమితాబ్ కు దీపావళి అంటే చాలా ఇష్టం. ఆ పండగను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నాడు.

సినీతారలు అందరికీ వినోదాన్ని, ఆనందాన్ని పంచుతారు. కానీ వాళ్లూ సంతోషంగా  పండగల్ని చేసుకుంటారు. ఇంటికి బంధువుల్ని, ఫ్రెండ్స్ ని, ఆత్మీయుల్ని  పిలిచి పార్టీ ఇస్తారు. అమితాబ్ కూడా ఈసారి దీపావళికి వాళ్లింట్లో పెద్ద పార్టీ ఇస్తాడట. స్నేహితుల్ని, సన్నిహితుల్ని  పిలిచాడట. అమితాబ్ ఆహ్వానించాడంటే అందరూ ఎంతో  గౌరవంగా భావిస్తారు. ఓ బొనాంజా అనుకుంటారు.

అమితాబ్  తమ ఇంట్లో ఇచ్చే దీపావళి పార్టీ కాబట్టి బిగ్ షాట్స్ వస్తారట. కపూర్స్ ఫ్యామిలీస్ కి, ఖాన్స్ ఫ్యామిలీస్ కి అమితాబ్  ఫేవరేట్. కాబట్టి ఆ కుటుంబాల వాళ్లు తప్పక రావచ్చనుకుంటున్నారు. సంప్రదాయమైన వంటకాలతో,  మిఠాయిలతో   విందు ఉంటుందని  అంటున్నారు. ఇటీవల అమితాబ్ కుటుంబంలో కొందరు మనస్తాపానికి గురైనా .. మళ్లీ ఈ దీపావళి ఆ ఫ్యామిలీలో  సంతోషాన్ని నింపుతుందని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.