బాలకృష్ణ సినిమాలో అమితాబ్

భారతదేశం గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్ మొదటిసారి ఒక తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. ఇది మనకు గర్వకారణం. నిజం చెప్పాలంటే… మహానటుడు అమితాబ్ తెలుగు సినిమాలో నటిస్తే చూడాలని చాలాకాలం నుంచి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం ఇప్పుడొచ్చింది. రీసెంట్ గా అమితాబ్ ఒక తెలుగు సినిమా చేయడానికి డేట్స్ కూడా ఇచ్చాడట.

తెలుగు సినిమాలో నటించాలని ఉందని, ఎవరైనా దర్శకుడు వచ్చి అడిగితే చేస్తానని బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. కాసేపు కనిపించే రోల్ అయినా చేస్తానన్నాడు. ఇప్పుడు అది నిజం కాబోతోంది. అయితే అది నిజానికి అమితాబ్ కు అవకాశం కాదు. తెలుగు సినిమాకు వచ్చిన అవకాశం అనాలి.

కృష్ణవంశీ దర్శకత్వంలో బాలకృష్ణ 101వ చిత్రంలో నటించడానికి ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓకే చెప్పాడు.

బాలకృష్ణ తను ప్రస్తుతం చేస్తున్న తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత…రైతు అనే పేరుతో 101వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రను అమితాబ్  చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో బాలకృష్ణ, కృష్ణవంశీ ముంబయ్ వెళ్లి ఆయనను కలిసి…తమ సినిమాలో చేయమని రిక్వెస్ట్ చేశారు. నందమూరి  ఫ్యామిలీ అంటే అభిమానం ఉన్న బచ్చన్ సరేనన్నారట.

రైతు సినిమాలో అమితాబ్  కేరక్టర్ గురించి బాలయ్య, కృష్ణవంశీ ఆయనకు చెప్పారు. ఆ పాత్ర నచ్చడంతో బిగ్ బి ఓకే అనడమే కాకుండా వెంటనే కాల్షీట్స్ కూడా ఇచ్చారట.

బాలకృష్ణ 101వ సినిమా కోసం అమితాబ్ బచ్చన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 17 రోజుల కాల్ షీట్స్ కూడా కేటాయించినట్టు తెలిసింది.  బిగ్ బీ ఇలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… ముందుగా అమితాబ్ వుండే సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.

అమితాబ్ బచ్చన్ ఆమధ్య అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం’ సినిమాలో కాసేపు కనిపించినప్పటికీ, ఒక తెలుగు సినిమాలో ఆయన పూర్తి నిడివి పాత్ర పోషించడం మాత్రం ఇదే మొదటిసారి అవుతుంది.  ‘రైతు’ సినిమా చేయడానికి అమితాబ్ బచ్చన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మూవీ రేంజ్ అమాంతం పెరిగిపోయిందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.