రైతుకి బీబ్ బి నో

నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రంతో పాటు 101వ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు బాలయ్య సిద్ధపడ్డారని సిగ్నల్స్ ముందు నుంచీ ఉన్నాయి. ఇక  ఇందుకు తగ్గట్లుగానే ఈ మూవీలో కీలకమైన ఓ పాత్ర కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను పర్సనల్ గా కలిసి మాట్లాడారు బాలయ్య. ఆ పరిస్థితులలో ఓకే అన్న అమితాబ్‌ ఇప్పుడు నో చెప్పాడనే టాక్ నడుస్తోంది.

బాలకృష్ణ తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తోండగా, ఈ మూవీ తర్వాత తన 101వ  చిత్రాన్ని కృష్ణవంశీ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాల్లో కృష్ణవంశీ బిజీగా వున్నాడు. రైతు అనే టైటిల్‌ తో తెరకెక్కనున్న  సినిమాలో ఒక కీలకమైన పాత్రను అమితాబ్ తో చేయిస్తే బావుంటుందని భావించిన బాలకృష్ణ – కృష్ణవంశీ ఆ మధ్య ముంబై వెళ్లి ఆయనని కలుసుకున్నారు.

సర్కార్ -3 సెట్ లో అమితాబ్‌ ని కలిసిన బాలయ్య  రైతు  సినిమా కథ .. ఆయన పాత్రను గురించి అమితాబ్ కు చెప్పగా, ఆయన తన డైరీ చూసి ఏ విషయం తర్వాత చెబుతానని అన్నారట. రీసెంట్‌ గా ఈ విషయానికి సంబంధించి  అమితాబ్‌ తో మాట్లాడగా, వచ్చే ఏడాది జూలై వరకూ డేట్స్ ఇవ్వలేననీ తేల్చి చెప్పారట. బిగ్‌ బీ నుండి ఈ మాట రావడంతో అటు బాలయ్యతో పాటు ఇటు కృష్ణవంశీ కూడా షాకయ్యారట

కృష్ణవంశీ సినిమాలో అమితాబ్‌ నటించేందుకు ఒకే అన్నాడని అప్పట్లో సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దాంతో అభిమానులు ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. కాని  వచ్చే ఏడాది జూలై వరకూ ఆగితే మాత్రం  డేట్స్ కేటాయించగలనని అమితాబ్ చెప్పడంతో యూనిట్‌కి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరు నెలలు షూటింగ్ వాయిదా వేసుకునే పరిస్థితి లేదు కాబట్టి.. బిగ్ బీ లేకుండానే ప్రొసీడ్ అయిపోవాలని రైతు యూనిట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.