రాష్ట్రపతి పాత్రలో అమితాబ్

బాలకృష్ణ, క్రిష్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. చక్కని కథాంశంతో ఆకట్టుకునే విజువల్స్ తో ఇప్పటికే బోలెడంత సంచలనం సృష్టించాడు శాతకర్ణి. తన వందో సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బాలయ్య, ఇప్పటికే తన 101 వ సినిమాపై కూడా ఓ క్లారిటీకి రావడమేకాదు,  ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేయడం విశేషం. అయితే ఈ సినిమాలో ఓ పాత్రచేయబోతున్న బిగ్‌ బీకి సంబంధించి తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్రశాతకర్ణి చిత్రం తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో 101 వ సినిమాగా రైతు అనే చిత్రాన్ని చేయనున్నాడు. ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీవచ్చింది. అయితే ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ పాత్ర చేయనున్నాడు. ఇటీవల సర్కార్ సెట్లో బిగ్ బీని కలసిన బాలయ్య ఓ కీలకపాత్ర చేయాలని కోరడం, అమితాబ్ అంగీకరించడం జరిగిపోయాయి.

రైతు సినిమాలో అమితాబ్ ‘భారత రాష్ట్రపతి’గా కనిపించనున్నారని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ ను తదుపరి రాష్ట్రపతిగా చూడాలని ఉందంటూ ఆమధ్య బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా చేసిన కామెంట్లు సంచలనాన్ని సృష్టించాయి. రాజకీయవర్గాలలో పెద్ద చర్చకు తెరతీశాయి కూడా. అయితే, శత్రుఘ్నసిన్హా కోరిక ప్రస్తుతానికి ఈ సినిమా ద్వారా తీరగలదని అంటున్నారు.

అబితాబ్‌ పాత్రకు ఉన్న ప్రాధాన్యం కారణంగా మన దేశంలో  మరే నటుడూ ఆ పాత్రకు పూర్తిగా సూటవరనే ఉద్దేశ్యంతోనే బిగ్ బీని అడిగారట. అమితాబ్ ఎంట్రీ కారణంగా ఇంకా సెట్ పైకి వెళ్లకుండానే రైతు సంచలనం అయిపోయింది. ప్రస్తుతం శాతకర్ణికి సంబంధించిన పనులను పూర్తిచేస్తున్నబాలయ్య జనవరిలో ఆ సినిమా రిలీజ్ అయ్యాక మార్చి చివవరి నుంచి రైతు షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే పూర్తిస్థాయి స్క్రిప్ట్ చేతిలో ఉండడంతో ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కువ ఆలస్యం ఉండదని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.