అమలాపాల్ ఫుల్ బిజీ

సమస్యలు అనేవి సహజం. అవి ఎవరికైనా  ఉంటాయి. వాటిని క్రాస్ చేసి ముందుకు వెళ్లడమే ధీరత్వం. సినిమా వాళ్లలోనూ  అలాంటి డేరింగ్ నేచర్ ఉన్నవాళ్లున్నారు. పరిస్థితుల ప్రభావం తమపై ఎంత ఉన్నా వెరవక ముందడుగు వేస్తూనే ఉంటారు. సినిమాల్లోనే కాదు .. ..జీవితంలోనూ  ప్రాబ్లెమ్స్ ని ధైర్యంగా ఫేస్ చేస్తారు. ఇందుకు ఎగ్జాంపుల్ గా నటి అమలాపాల్ ను చెప్పుకోవచ్చు.

హీరోయిన్  అమలాపాల్ కు ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్  ఉన్నాయి.  సరిగ్గా రెండేళ్ల కిందట డైరెక్టర్  ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలు చేయనని, ఒకవేళ చేసినా  కొంత గ్యాప్ తప్పదని చెప్పింది. కానీ అమల పాల్ మ్యారేజ్ లైఫ్ అనుకున్నంత సజావుగా సాగలేదు. భర్త విజయ్ తో గొడవలు రావడంతో  వ్యవహారం విడాకుల వరకు వచ్చింది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది.

పెళ్లి తర్వాత తన లైఫ్ ఇలా అయినందుకు అమలాపాల్  బాధపడలేదు. అయితే అయిందిలే .. .. మళ్లీ సినిమాలు చేద్దాం అనుకుంది. కానీ ఆమెకు సినిమా ఛాన్సులు రానీకుండా విజయ్ తండ్రి ప్రతి చోటా అడ్డుపడ్డాడు.  కానీ విధికి ఎదురీదిన అమలాపాల్  ధైర్యంగా ముందడగు వేసింది. మళ్లీ సినిమా ఛాన్సుల్ని దక్కించుకుంటోంది. ఇప్పుడు అమలాపాల్  చేతిలో మూడు భాషల సినిమాలున్నాయి.

ప్రస్తుతం తను తమిళంలో ‘వడ చెన్నయ్’, ‘తిరుట్టు పయిలే’ సీక్వెల్ చిత్రాలతో పాటు, మలయాళంలో ఒక సినిమా, కన్నడలో ‘హెబ్బులి’ అనే సినిమా చేస్తోంది. అంతేకాక తెలుగులో అల్లరి నరేశ్ తో ఒక సినిమాను అంగీకరించింది. అలాగే తమిళ, తెలుగు భాషల్లో మరికొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయట. అంతేకాదు.. .. హాట్  పోజులతో ఫోటో షూట్ ను చూస్తేంటే అమల ‘ఏ తరహా పాత్రకైనా  రెడీ’ గా ఉన్నట్టు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.