అల్లరి నరేష్ తండ్రి అయ్యాడు

పిల్లలంటే అందరికీ ప్రేమే. అందులోనూ మొదటిసారి తండ్రి అయితే ఇంక ఆనందం మాటలకందనిది. సామాన్యులే కాదు…సినీ ప్రముఖులూ ఆ మూవ్ మెంట్ ను ఎంజాయ్ చేస్తారు. అలాగే సెంటిమెంటల్ గా కూడా ఫీలయ్యే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. బాబు కానీ, పాప కానీ పుడితే ఆ సంతోషం చెప్పనలవి కాదు. లేటెస్ట్ గా ఓ విచిత్రమైన సన్నివేశం కూడా చోటు చేసుకుంది.

పెళ్లికి ముందు ఎంత అల్లరి చేసినా పెళ్లయ్యాక జీవితం ఓ గాడిలో పడుతుంది. ఇంక ఓ బిడ్డకు తండ్రయితే ఆ ఆనందానికి అవధులు ఉండవు.  అల్లరి నరేష్ ఇప్పుడు  ఆ ఆనందాన్ని, మొదటిసారి తండ్రి అయిన సంతోషాన్ని  అనుభవిస్తున్నాడు. నరేష్ భార్య విరూప  ఆడపిల్లను కన్నది.  తాను ఓ చక్కని బుజ్జి పాపకు తండ్రినయ్యానని నరేష్ తన ట్విటర్ లో రాశాడు. దసరాకు ముందే తండ్రి కావడం చాలా సంతోషంగా ఉందని, ఇలా జరగడం తన అదృష్టమని అల్లరి నరేష్ చెప్పాడు.

పిల్లలతో గడపడం నరేష్ కు కొత్తకాదు. అతని అన్న కొడుకు అల్లరి నరేష్ దగ్గరే ఉంటాడట. ఆ బాబు అంటే ఎంతో ఇష్టమట. ఇంకో విశేషమేంటంటే…అల్లరి నరేష్ నటించిన “ఇంట్లో దెయ్యం..నాకేం భయం” దీపావళికి రిలీజ్ అవుతోంది.  ఈవిధంగా చూస్తే అల్లరి నరేష్ కు డబుల్ ధమాకా దక్కినట్టే అనవచ్చు.

పవన్ ‘చెల్లి’ తల్లి అయింది

ఇలాంటి సందర్భమే మరొకటి ఉంది. పవన్ కల్యాణ్  నటించిన అన్నవరం సినిమాలో అతని చెల్లెలుగా నటించిన సంధ్య తల్లి అయింది. ఈ వార్త పవన్ కు కూడా సంతోషం కలిగించింది. సిస్టర్ సెంటిమెంట్ తో పవన్ చేసిన ఒకే ఒక మూవీ ‘అన్నవరం’. ప్రేమిస్తే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంధ్య…. ఆ తర్వాత పలు సినిమాల్లో చేసి ఐటి ప్రొఫెషనల్ వెంకట్ చంద్రశేఖరన్ ను  పెళ్లి చేసుకొని గృహిణిగా స్థిరపడింది.

Leave a Reply

Your email address will not be published.