పాకిస్థాన్ నటులు భారత్ విడిచి వెళ్ళాలి-ఎంఎన్ఎస్

ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌కు బెదిరింపులు వచ్చాయి. ఆయన సినిమాను విడుదల కానివ్వమని కొందరు బెదిరింపులకు దిగారు. అయితే కరణ్ మాత్రం వారి బెదిరింపులకు బయపడేది లేదన్న తీరులో వున్నాడు.

యూరి దాడి నేపథ్యంలో పాకిస్థానీ నటీనటులు ముంబై వదిలి స్వదేశానికి వెళ్లిపోవాలంటూ మహరాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) గతంలో ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసిన నేపధ్యంలో జరిగిన సమావేశంలో ఈ హెచ్చరికను జారీ చేసారు. ముంబైలో పాకిస్థానీ కళాకారులకు మద్దతు ఇస్తానని, కేవలం పాకిస్దాన్ కళాకారులపై నిషేధం విధించడం వల్ల సమస్య పరిష్కారం కాదని కరణ్ చెప్పడంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆయనపై తీవ్రంగా మండిపడుతూ ఈ ప్రకటన చేసింది. కరణ్ తీసే సినిమాల్లో పాకిస్థానీ కళాకారులకు అవకాశం ఇస్తే తమదైన శైలిలో ఆయనకు తగిన గుణపాఠం చెబుతామని ఎంఎన్ఎస్ హెచ్చరించింది.

యురి దాడి నేపథ్యంలో పాకిస్థానీ నటీనటులు ముంబై వదిలి స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఎంఎన్ఎస్ ఇచ్చిన గడువుతో ఇప్పటికే వాళ్లంతా ముంబై వదిలి వెళ్లిపోయారట, నగరంలో ఇప్పుడు ఒక్క పాకిస్థానీ కళాకారుడు కూడా లేరని ఎంఎన్ఎస్ సీనియర్ నేత అమే ఖోప్కర్ తెలిపాడు. పొరపాటున తమకు ఎవరైనా కనపడితే మాత్రం వాళ్లను తరిమి కొడతామని ఎంఎన్ఎస్ సంస్థ హెచ్చరిస్తోంది.

ఎంఎన్ ఎస్ హెచ్చరికలు ఖాతర్ చేయని కరణ్ జోహార్‌కు దమ్ముంటే ఒక్క పాకిస్థానీ నటుడినైనా తన సినిమాల్లోకి తీసుకోవాలని, అప్పుడు తామేం చేస్తామో చూడాలని ఖోప్కర్ అన్నారు. ఏవైనా సినిమాల్లో పాకిస్థానీ నటీనటులుంటే ఆ సినిమాలను ఇక్కడ విడుదల కానిచ్చేది లేదిన మరో సీనియర్ నేత షాలినీ ఠాక్రే చెప్పారు. ఈ ఘటనతో బాలీవుడ్ అంతా వేడెక్కెంది. రాబోయే రోజుల్లో బాలీవుడ్ లో ఏం జరగబోతుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published.