అఖిల్ పెళ్ళి సందడి

అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నటవారసుడు అఖిల్, తన రెండో సినిమాతో పాటు పెళ్లి వార్తలతోనూ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. తొలి సినిమా పరాజయంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్, ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అదే సమయంలో తన పెళ్లి వేడుకకు కూడా ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. అయితే ఈ వివాహ వేదికను పరాయిదేశంలో ఫిక్స్ చేయడం విశేషం. అక్కినేని మూడో తరం వారసుడు  అఖిల్ ప్రేమ వివాహం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శ్రియా భూపాల్ ని ప్రేమిస్తున్న  అఖిల్‌ తన వివాహాన్ని కాస్త వెరైటీగా జరుపుకోవాలని భావిస్తున్నాడట. అందుకు శ్రియ ఫ్యామిలీ జివికె అండ్ సోమ్ భూపాల్ లు కూడా రెడీగా ఉన్నారట. శ్రియ ఫ్యామిలీ  బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి.. వారు అత్యంత గ్రాండ్ గా చేద్దాం అని ఫిక్సయ్యారట.

అఖిల్‌ కొన్నాళ్ళుగా ఫ్యాషన్ డిజైనర్ శ్రియ భూపాల్ తో ప్రేమలో ఉండగా, వీరి నిశ్చితార్ధ వేడుకని వచ్చే నెలలో నిర్వహించాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నాయట. ఆ తర్వాత సమ్మర్ లో వీరి వివాహన్ని డెస్టినేషన్ తరహాలో జరపాలని  అఖిల్ పట్టుబట్టడంతో ఇరు కుటుంబ సభ్యులు విదేశాలలో అఖిల్‌, శ్రియ ల పెళ్ళి వేడుకకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

ఇటలీలోని నేపుల్స్, రోమ్ నగరాల్లో అనువైన ప్రదేశాలను వెడ్డింగ్ కోసం వెతికి.. అందులో ఒక వెన్యూను ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. బహుశా 2017 తొలి భాగంలో జరిగే ఈ పెళ్లి కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 గెస్టులు వస్తారని తెలుస్తోంది. వారందరికీ సెవెన్-స్టార్ ఆతిధ్యంతో పాటు.. ఇటలీలో నాలుగురోజుల పాటు గ్రాండ్ రిసప్షన్ హోస్ట చేయనున్నారు.  ఇకపోతే పెళ్ళి ఇటలీలో అంటే..  నాగార్జున ఫిలిం ఇండస్ర్టీ కోసం హైదరాబాద్ లో రిసప్షన్ ఏర్పాటు చేస్తారేమో  అనే టాక్స్ వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.