కరణ్ జోహార్ కు నో చెప్పిన ఐశ్వర్య

ఎవరికైనా వరసగా కష్టాలు ఎదురవుతుంటే సినిమా కష్టాలంటారు. ఇదివరకటి  సినిమాల్లో  ఆయా పాత్రలు  కష్టాలు, కన్నీళ్ల చుట్టే తిరిగేవి. వాళ్లకు రాని కష్టం అంటూ ఉండదు. సీరియల్ గా కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సినిమాల్లోనే కాదు, సినిమా తీయడంలోనూ  బోలెడు సమస్యలుంటాయి.  అవేమిటో మూవీ మేకర్స్ కు తెలుసు. ఓ బాలీవుడ్ పిక్చర్ కు ఇప్పుడు అలాంటి సీరియల్ కష్టాలే వచ్చాయి.

ఐశ్వర్యా రాయ్, రణబీర్ కపూర్, అనుష్కశర్మ నటించిన మూవీ ‘ఏ దిల్ హై ముష్కిల్’. ఏ ముహూర్తాన ఆ టైటిల్ పెట్టారో కానీ, ఆ పేరుకు తగ్గట్టే ఆ సినిమాకు ఒకదాని తర్వాత ఒకటిగా కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ పిక్చర్ లో రణబీర్, ఐశ్వర్య యాక్ట్ చేసిన కొన్ని హాట్ సీన్స్ పై వివాదాలు, విమర్శలూ వచ్చాయి. దాంతో సెన్సార్ బోర్డ్ ఆ సీన్స్ ను తొలగించాలని ఆదేశించింది. సమాజపరంగా చూస్తే ఇలా చేయడం మంచిదే మరి.

ఈ సంగతి ఇలా ఉంటే, ఏ దిల్ హై ముష్కిల్  సినిమాలో పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్  కీలక పాత్ర పోషించడం ఇప్పుడు మరో సమస్య తెచ్చిపెట్టింది. ఇండియాపై పాకిస్థాన్ ఉగ్రదాడులు జరపడం, వాటికి ప్రతీకారంగామనదేశం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ తో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ ప్రభావం సినీరంగంపై కూడా పడింది. పాకిస్థాన్ నటులను బాలీవుడ్ బ్యాన్ చేసింది. ఈ పరిస్థితిలో… ఏ దిల్ హై ముష్కిల్ లోఫవాద్ నటించడం నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ కు ముష్కిల్ గా మారింది.

ఈ సినిమాను  అడ్డుకుంటామని శివసేన పార్టీ ఇప్పటికే ప్రకటించింది. పులిమీద పుట్రలా ఇప్పుడు ఇంకో ఇబ్బంది తలెత్తింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తాను పార్టిసిపేట్ చేయనని ఐశ్వర్యారాయ్ చెప్పింది. ఈ సినిమాలో తాను స్పెషల్ అప్పీయరెన్స్ మాత్రమే ఇచ్చానని, అందుకని ప్రచార కార్యక్రమాలకు రానని ఐష్ చెప్పడంతో ఈ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్కు ఉన్నవి చాలక ఈ కొత్త కష్టం వచ్చిపడింది.

Leave a Reply

Your email address will not be published.