రెచ్చిపోయిన ఐశ్వర్యారాయ్

ఐశ్వర్యారాయ్ అభిషేక్ తో పెళ్లి తరువాత కుటుంబానికే పరిమితమైంది. కూతురు ఆరాధ్యా కొంచెం పెద్దగా అయ్యే వరకు సినిమా ఊసెత్తలేదు. అంతకు ముందు వరకు బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ గా వున్న ఐష్ ఒక్కసారిగా తన గ్రాఫ్ పడిపోయింది. అయితే ఐశ్వర్యా ఆరాధ్యా కొంచెం పెద్ద అయిన వెంటనే రీఎంట్రీ ఇచ్చింది. అయినా తగిన గుర్తింపు రాలేదు. వెంటనే బాలీవుడ్ పల్స్ తెలిసిన ఆమె రూటు మార్చి హల్ చల్ చేస్తుంది.

బాలీవుడ్ అందాల తార, మాజీ ప్రపంచ సుందరి సెకండ్ ఇన్నింగ్స్ మొదట్లో కాస్త హుందాగా వుందామని లేడీ ఓరియంటెడ్  సబ్జెక్టులు ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్ కాక పోవడంతో ఆమె తన పాత పద్దతిని ఇంప్లిమెంట్ చేసింది. ప్రస్తుతం ఆమె కరణ్ జోహార్ దర్శకత్వంలో ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే రొమాంటిక్ ఎంటర్టెనర్లో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ చూసి ఏంటి ఈమె ఐశ్వర్యారాయేనా అనే అనుమానాన్ని కలిగించింది.

`ఏ దిల్ హై ముష్కిల్` సినిమాలో ఐశ్వర్యా రాయ్ హాట్ హాట్ రొమాంటిక్ సీన్లలో నటించింది.ఈ సీన్లు చూసిన ఆమెపై పుకార్లూ మొదలయ్యాయి. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ ఇంత హాటుగా, ఘాటుగా రొమాన్స్ చేయడం బచ్చన్ కుటుంబానికి నచ్చలేదని, ఆ సీన్లపై అభిషేక్ తో పాటు అత్తమామలు ఐష్ పై చాలా కోపంగా వున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఇందులో ఐశ్వర్యరాయ్ కాస్ట్యూమ్స్, మేకప్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. అందుకే ఆమె తన గత రెండు సినిమాల కంటే మరింత సెక్సీ లుక్ తో కనిపించారు.

బాలీవుడ్లో సెన్సేషన్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ సినిమాలకు కరణ్ జోహార్ పెట్టింది పేరు. ఈ సినిమాతో ఆయన భారీ బ్లాక్ బస్టర్ ప్లాన్ చేసారు. ఈ మధ్య కాలంలో అసలు బాలీవుడ్లో రాని ఒక కొత్త ప్రేమ కథను, రొమాంటిక్ యాంగిల్ ను ఈ సినిమాతో చూపించబోతున్నారని యూనిట్ అంటుంది.

Leave a Reply

Your email address will not be published.