హాట్ సీన్లలో ఐష్

కొన్ని సీన్లు చేయడానికి అప్పుడప్పుడు హీరోయిన్స్ అభ్యంతరం చెబుతుంటారు. రొమాంటిక్ సీన్స్ చేసే విషయంలోనే ఇలా అబ్జెక్ట్ చేస్తుంటారు. లవ్ సీన్స్ లో ఓవర్ డోస్ వద్దని, లిమిట్ దాటకుండా ఉండాలనీ అంటారు. మరో టైప్ వాళ్లూ ఉన్నారు. ఇంటిమేట్ సీన్స్ పండాలంటే మోతాదు పెంచక తప్పదని కోరి మరీ చేస్తారు. ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్ లో ఇలాంటి సిట్యుయేషనే ఎదురైంది.

ఐశ్వర్యరాయ్-రణబీర్- అనుష్క శర్మ నటిస్తున్న సినిమా ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’. ఈ మూవీలో ఐష్-రణబీర్ రొమాన్స్ కు సంబంధించి కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా టీజర్, అఫీషియల్ ట్రైలర్, వీడియో సాంగ్స్ లో రణబీర్ -ఐశ్వర్యారాయ్ మధ్య హాట్ సీన్స్ చూసినవాళ్లు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్ కోడలు ఇలాంటి రొమాంటిక్ సీన్స్ చేసిందా? అని ఆశ్చర్యపోతున్నారు.

ఈ మూవీ టీజర్, ట్రైలర్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. పెళ్లయి, బిడ్డ తల్లి కూడా అయిన ఐశ్వర్యారాయ్ ఈ సీన్స్ చేయడానికి ఎలా అంగీకరించింది, అభ్యంతరం చెప్పలేదా? అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె వద్దన్నా తీశారా? అనే డౌట్స్ వస్తున్నాయి. ఇలా ఉండగా…మరో రకమైన ప్రచారం కూడా జరుగుతోంది.

ఈ మూవీకి ఐశ్వర్యారాయ్ ను తీసుకున్నప్పుడు ఆమె పాత్రకు ఇలాంటి సీన్స్ లేవట. ఈ సినిమా నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ కూడా అలా ఆలోచించలేదట.  స్ర్కిప్ట్ లో కూడా అలాంటి సీన్స్ లేవట. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఐశ్వర్యారాయ్ కోరిన మీదటే ఇలా తీశారట. సినిమాలో తన పాత్ర  స్ర్కిప్ట్ చదివినప్పుడు ఏదో లోటు ఉందని, తన కేరక్టర్ ను చంపేశారని ఐష్ కి అనిపించిందట.

తన పాత్ర బాగా రొమాంటిక్ గా ఉండాలని, అలా అయితేనే చేస్తానని ఐశ్వర్యారాయ్ చెప్పిన తర్వాతే యాక్ట్ చేస్తానని చెప్పడంతో ఆమె చెప్పినట్టు సీన్స్ ను బాగా రొమాంటిక్ గా, రణబీర్- ఐష్ ల మధ్య బాగా ఇంటిమసీని చూపించే విధంగా మార్చారట.

Leave a Reply

Your email address will not be published.