యాక్సిడెంట్ తో మారిన షెడ్యూల్స్

సినిమావాళ్లూ మనుషులే కదా? పాపం వాళ్లకూ సమస్యలుంటాయి, కష్టాలుంటాయి, ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్టు జరగదు. ఏదో ఒక ఆటంకం వస్తుంది. దాంతో మూవీ ప్లాన్స్ కాస్తా మారిపోతుంటాయి. షెడ్యూల్స్ అన్నీ తలకిందులై పోతుంటాయి. యంగ్ హీరో వరుణ్ తేజ్ విషయంలో కూడా  ఇలాగే జరిగింది. అందుకే… దేనికైనా టైం రావాలి. వరుణ్ తేజ్ విషయంలో అసలేం జరిగిందంటే…

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కు ఈమధ్య యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే శ్రీను వైట్ల మూవీ మిస్టర్ కు ఊటీ షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగి కాలికి ఫ్రాక్చర్ అయింది. దాంతో షూటింగ్ కు ఆటంకం కలిగింది. అయితే ఎలాగోలా ఆ షెడ్యూల్ పూర్తిచేశామనిపించారు.

వరుణ్ తేజ్ కు యాక్సిడెంట్ జరక్కపోతే ఈసరికి అమెరికాలో ఉండాల్సిన మాట. మిస్టర్ తర్వాత వరుణ్ … శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా మూవీ చేయాల్సి ఉంది. ఆ పిక్చర్ లేటెస్ట్ షెడ్యూల్ అమెరికాలో చేయాలనుకున్నారు. కానీ వరుణ్ ఇప్పుడు అక్కడికి వెళ్లే పరిస్థితిలో లేడు. యాక్సిడెంట్ పెద్దది కాకపోయినా వరుణ్ తేజ్ నడిచే పరిస్థితిలో లేడంటున్నారు. కనీసం అయిదు వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారట.

తప్పనిసరిగా రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో అతను నెలకు పైగా రెండు సినిమాల షెడ్యూల్స్ పోస్ట్ పోన్ చేసుకోక తప్పలేదు. ప్రస్తుతం స్టార్ట్ చేయాల్సింది శేఖర్ కమ్ముల మూవీ షెడ్యూల్ అయినా… తను కోలుకున్నాక ముందుగా శ్రీను వైట్లకే సినిమానే  చేస్తాడట. ఈ షెడ్యూల్ తో వైట్ల తీస్తున్న మిస్టర్ షూటింగ్ పూర్తవుతుందట. ఆ తర్వాత ఫిదా కోసం లావణ్య త్రిపాఠితో కలిసి అమెరికా వెడతాడు వరుణ్ తేజ్. ఇక ఫిదాలో మలయాళీ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.