తండ్రి బర్త్ డే కి అపురూప కానుక

బర్త్ డే కి గిఫ్ట్ లు ఇవ్వడం, కేక్ లు కట్ చేయడం ఆవవాయితీ. ఉన్న వాళ్లే కాదు, ఉండీ లేని వాళ్లు కూడా పుట్టిన రోజు వేడుక జరుపుకుంటారు. పిల్లల పుట్టిన రోజును పేరెంట్స్ సెలెబ్రేట్ చేయడమే కాదు, పిల్లలు కూడా తండ్రి బర్త్ డే ని వేడుకగా జరుపుతారు. కానుకలు ఇస్తుంటారు.  తమిళ హీరోలు సూర్య, కార్తి తమ డాడీ బర్త్ డే కి అపురూపమైన గిఫ్ట్ ఇచ్చారు.

ఇంట్లో ఎవరి పుట్టిన రోజు వచ్చినా ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. పుట్టిన రోజు ప్రతి మనిషికీ  ఓ పండగ. ఒక గుర్తుంచుకోదగ్గ జ్ఞాపకం. సెలెబ్రిటీస్ అయితే చెప్పక్కర్లేదు. ఫుల్ హ్యాపీస్.  ఇక పిల్లల సంగతి చెప్పక్కర్లేదు. తమను పెంచి పెద్ద చేసిన తలిదండ్రుల పుట్టిన రోజు పిల్లలకు ఎంతో ఆనందాన్నిస్తుంది.  ఇప్పుడు తమిళంలో స్టార్ హీరోస్ గా ఉన్న సూర్య, కార్తి, తమిళ నటుడు శివకుమార్ కుమారులు. ఆ ఇద్దరూ  తమ తండ్రికి ఓ అపురూపమైన కానుక ఇచ్చారు.

శివకుమార్ తమిళంలో ప్రముఖ నటుడు. ఒకప్పుడు హీరో. దాదాపు 170 సినిమాల్లో నటించిన శివకుమార్ కు ఇప్పుడు 75 ఏళ్లు. ఈ నెల 27న ఆయన బర్త్ డే. ఆ పుట్టిన రోజుకు తనయులిద్దరూ  ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా? ఓ ఎగ్జిబిషన్. అవునండీ. తండ్రికి బర్త్ డే గిఫ్ట్ గా పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆ ఎగ్జిబిషన్ ను శివకుమార్ కొడుకులే ఏర్పాటు చేశారు. ఇంతకూ ఆ పెయింటింగ్స్ ఎవరు వేశారో తెలుసా? శివకుమార్.

శివకుమార్ నటుడు మాత్రమే కాదు. మంచి పెయింటర్ కూడా. నిజం చెప్పాలంటే  అతనికి పెయింటింగ్ పైనే ఎక్కువ ఇంటరెస్ట్. ఆయన చిన్నప్పుడే  పెయింటింగ్స్ వేయడం మొదలు పెట్టాడు. ఇప్పటివరకు  కొన్ని వందల పెయింటింగ్స్ వేశాడు. అందులో చిన్ననాటి సూర్య పెయింటింగ్ కూడా ఉంది. ఎగ్జిబిషన్ లో మొత్తం 140 పెయింటింగ్స్ ఉన్నాయి. చూసిన వారంతా  ఎంతో ప్రశంసించారు. ఏ పెయింటర్  కైనా, ఏ తండ్రికైనా ఇంతకు మించి ఆనందం ఏముంటుంది? ఏ తనయుడికైనా తండ్రి సంతోషాన్ని తప్ప ఇంకేం కోరుకుంటాడు?

Leave a Reply

Your email address will not be published.