హీరో ఇమేజ్ తెచ్చుకున్న నవ్వుల నవాబు

మన సినిమాల్లో మొదటి నుంచీ కామెడీకి మంచి గుర్తింపు ఉంది. ఎంతగా గుర్తింపు ఉందంటే హీరోలు కూడా కామెడీ చేసేస్తున్నారు. అదివరకు హాస్యరసాన్ని పండించేందుకు కమేడియన్లు ఉండేవారు. వారిలో ఎంతో పేరు తెచ్చుకున్నవారు ఉన్నారు. ఒకప్పటి రాజబాబు కు తెలుగు సినిమాల్లో ఎంతటి పేరుందో అప్పటికీ, ఇప్పటికీ అందరికీ తెలుసు. అలాంటి రాజబాబు జయంతి నిన్ననే వచ్చి వెళ్లిపోయింది. కానీ ఆయన పండించిన హాస్యం మన జ్ఞాపకాలనుంచి ఎప్పటికీ వెళ్లిపోయే అవకాశం లేదు.

నవ్వుల రేడు రాజబాబు అంటే ఒకప్పుడు ఎంతో క్రేజ్. ఎంత క్రేజ్ అంటే  హీరోలకు మించిన ఎట్రాక్షన్ ఆఊయనకు ఉండేది. రాజబాబు లేని  సినిమా అంటూ ఉండేది కాదు. రాజబాబు ఉంటే చాలు… అనుకునేవారు ప్రొడ్యూసర్లు. సన్నగా రివటలా కాస్త పొట్టిగా ఉండే రాజబాబు అంటే  ఆడియన్స్ కు యమ పిచ్చి.

రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పారావు. అతన్ని చూస్తేనే చాలు నవ్వొచ్చేది. మాట వింటే పిచ్చిక కిచకిచలాడుతున్నట్టు ఉండేది. పిట్టలా ఉంటే మటుకేం…కొండంత హాస్యాన్ని అందించాడు. కమేడియన్స్ లో కూడా  హీరో హీరోయిన్లకు మాదిరే హిట్ పెయిర్ ఉండేది. రాజబాబు – రమాప్రభ అలాంటి హిట్ పెయిర్.

సినిమాల్లో రాజబాబు ఎంతగా నవ్వించాడో నిజజీవితంలో అంత వేదాంతి. జీవితంలో అతను పడిన కష్టాలు అతన్ని ఫిలాసఫీ వైపు నడిపించాయి. సినిమాల్లో తిరపతి, తాత -మనవడు వంటివి రాజబాబు విషాద నటనకు మచ్చు తునకలు. ప్రతి కమేడియన్ జీవితంలోనూ కన్నీళ్లు ఉంటాయనడానికి రాజబాబు జీవితమే ఉదాహరణ.

Leave a Reply

Your email address will not be published.