70 ఏళ్ళవాడిగా సల్మాన్ ఖాన్

టాలీవుడ్ లో కానీ, బాలీవుడ్ లో కానీ హీరో పాత్రల వయసు ఎప్పుడూ పాతికేళ్లే. ఆ రోల్ వేసే నటుడికి నిజంగా ఎంత వయసువున్నా, కేరక్టర్ ఏజ్ మాత్రం పాతికేళ్లకు మించి ఉండదు. హీరో వయసు ఎక్కువగా ఉంటే ఆడియన్స్ చూడరనే ఓ ఒపీనియన్ ఉంది.  ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమాలో ఇందుకు రివర్స్ గా జరగబోతోంది. హీరో  కేరక్టర్ వయసు 70 ఏళ్లట.

సినిమా హీరో అంటే పాతికేళ్ల కుర్రాడే. ఈ ఫార్ములా మారదు.  ఎప్పుడో చాలా రేర్ గా హీరోలు ఏజ్ డ్ కేరక్టర్స్ వేస్తుంటారు. కానీ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ సినిమాలో ఏజ్ డ్ కేరక్టర్ (వృద్ధుడి పాత్ర) లో కనిపించబోతున్నాడు.  2012లో వచ్చిన ఏక్తా టైగర్ అనే పిక్చర్ కు సీక్వెల్ గా సల్మాన్ హీరోగా టైగర్ జిందా హై … మూవీ రాబోతోంది. ఇందులో సుల్తాన్ వేసే కేరక్టర్ డిఫరెంట్ ఏజెస్ లో సాగుతుంది.

టైగర్ సినిమాలో  సల్మాన్ పాత్ర 17 ఏళ్లతో స్టార్ట్ అయి 70 ఏళ్లవరకు రన్ అవుతుంది. ఈ పిక్చర్ లో సల్లూ భాయ్, అతని మాజీ ప్రియురాలు కత్రినాకైఫ్ యాక్ట్ చేస్తున్నారు. భారత నిఘా సంస్థ  రా అధికారిగా సల్మాన్ ఖాన్ , పాకిస్థాన్ గూఢచారిణిగా కత్రినా కైఫ్ నటిస్తారు. విచిత్రమేంటంటే, పేరుకు రెండు దేశాల గూఢచారులైనా వీరిద్దరూ ఈ సినిమాలో ఉమ్మడి శత్రువుపై పోరాడుతారు.

ఏక్తా టైగర్ ను కబీర్ ఖాన్ డైరెక్ట్ చేశాడు.  యశ్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాబోతున్న ఈ సీక్వెల్ ను అలీ అబ్బాస్ జఫర్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోయే ఈ పిక్చర్ ను 2017 ఈద్ కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. కబీర్ ఖాన్ -సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ ఇన్ మనాలీ షూటింగ్ లో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published.