బోయపాటి సినిమాకు నాలుగో నిర్మాత

సాధారణంగా ఓ సినిమాకి యాక్టర్లో, టెక్నీషియన్లో మారడం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా ప్రొడ్యూసరే మారిపోయే సంఘటనలు బాగా అరుదుగా జరుగుతాయి. ఒకే సినిమాకి ఒకటికి నాలుగుసార్లు నిర్మాత మారడం అంటేమాత్రం అక్కడ ఏదో జరుగుతోందనే విషయం గమనించాల్సిందే. మరి టాలీవుడ్‌ లో ఓ ప్రాజెక్టుకు సంబంధించి ఇలాంటి పరిస్థితే రాగా ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంపై తాజాగా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా నిర్ణయం అవడమేకాదు. ఇప్పటికే మొదలైపోయింది కూడా. ప్రాజెక్టు అనుకున్నప్పటినుంచి ఈ మూవీకి ప్రొడ్యూసర్ మారిపోతూనే ఉన్నాడు. మొదట సినిమా అనుకున్నపుడు బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఆ తర్వాత ఈయన సైడ్ అయిపోగా.. నల్లమలుపు బుజ్జి సీన్లోకి వచ్చాడు.

కొన్నాళ్ళ తర్వాత బుజ్జి తప్పుకోవడంతో అభిషేక్ నామా బోయపాటి ప్రాజెక్టుకు అండగా నిలుస్తాడని అన్నారు. ఈయన కూడా ప్రాజెక్టునుంచి వైదొలగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు బోయపాటి శ్రీను-బెల్లంకొండ శ్రీనివాస్ ప్రాజెక్టుకు రవీంద్రారెడ్డి అనే  కొత్త నిర్మాత సీన్లోకి వచ్చాడట. వచ్చే నెలలో విడుదల కానున్న నాగచైతన్య మూవీ సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి నిర్మాతే ఈ రవీంద్రారెడ్డి.

రవీంద్రారెడ్డి నిర్మాణంలో బోయపాటి తెరకెక్కించనున్న సినిమా నవంబర్ 4వ తేదీన పూజా కార్యక్రమాలు జరుపుకోనుందని అంటున్నారు. ఇక ఆ వెంటనేరెగ్యులర్ షూటింగుకి వెళతామని చెప్పారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుందని అన్నారు. ‘సరైనోడు’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత బోయపాటి చేస్తోన్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఉంటాయనీ, వాటిని అందుకునే దిశగా కృషిచేస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.