శేఖర్ కమ్ముల స్టోరీకి మహేష్ బాబు నో

మంచి కేరక్టర్స్ చేయాలని నటీనటులకు ఉంటుంది. అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఎన్ని కేరక్టర్స్ వేసినా ఇష్టమైన పాత్ర చేయకపోతే వారికి తృప్తి ఉండదు. కథలు తయారు చేసేవారు కూడా ఒక్కో హీరోని, లేదా హీరోయిన్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తుంటారు. కానీ, ఏవో కారణాల వల్ల ఆ హీరో ఒప్పుకోడు. ఆ పాత్ర వేరేవాళ్లు వెడుతుంది.  ఇప్పుడు తాజాగా అలాంటి ఓ అవకాశం ఓ హీరో కాదంటే మరో హీరోను వరించింది.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తనదైన శైలిలో సినిమాలు తీస్తుంటాడు. ఆయన సినిమాలు ఆహ్లాదంగా ఉంటాయి. మనసుకు హత్తుకుంటాయి. చాలా చిన్న పాయింట్ తో అందంగా సినిమా తీయడం ఆయన అలవాటు. కానీ ఈమధ్య శేఖర్ కమ్ములకు కొంత గ్యాప్ వచ్చింది. ఈ డైరెక్టర్ తీసిన ఆనంద్, హ్యాపీ డేస్ సినిమాలు మాస్ ను, క్లాస్ ను ఆకట్టుకున్నాయి. శేఖర్ సినిమాలకు హీరోలు కూడా ఫిదా అయిపోతుంటారు.

పాత్రనుబట్టి నటీనటుల్ని ఎంచుకోవడం శేఖర్ కు అలవాటు. ఫలానా పాత్రకు కరెక్ట్ గా ఆ హీరోనే సరిపోతాడు అనే నమ్మకం బలంగా ఉంటుంది. ఆ ఆలోచనతోనే మహేష్ బాబు తో సినిమా చేయాలని కథ తయారు చేసుకున్నాడు శేఖర్ కమ్ముల. ఆ కథ తో సినిమా చేయడం ఖాయమని అప్పట్లో అనుకున్నారు కూడా. కానీ మహేష్ మాత్రం ఆ సినిమా చేయలేదు. అయితే, మహేష్ రిజెక్ట్ చేసిన కథ ఇప్పుడు మెగా వారసుడు వరుణ్ తేజ్ చేస్తున్నాడు.

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న కొత్త సినిమా ఫిదా. దిల్ రాజు ఈ సినిమా తీస్తున్నాడు. తెలంగాణ ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకొని ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఆ మధ్య నయనతారతో తీసిన అనామిక మూవీ ఫ్లాప్ కావడంతో శేఖర్ కొంత డిసపాయింట్ అయ్యాడు. అందుకే కొంత విరామం తీసుకొని సినిమా చేస్తున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు కాబట్టి, ఆడియన్స్ ఫిదా అయిపోతారని కమ్ముల అనుకుంటున్నాడట.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.