వారిద్దరి మధ్య ఏం జరిగింది?

వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. ఇక పట్టాలెక్కుతుందని అంతా అనుకుంటున్న టైంలో ప్రాజెక్ట్ ఆగిపోయింది. తనకు సినిమా ఇస్తాడని ఆ హీరో వెంటే తిరిగిన ఆయనకు ఆ స్టార్ హీరో మొండి చేయి చూపించాడు. దీంతో వెంటనే మరో హీరోతో ప్రాజెక్ట్ ను ఓకే చేయించుకున్నాడు రైటర్. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు, వారిద్దరి మధ్య ఏంజరిగింది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

వక్కంతం వంశీ ఇండస్ట్రీలో తలలో నాలుక లాంటి వాడు. మంచి రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు వక్కంతం హిట్ కథలు అందించాడు. రైటర్ గా ఎంతకాలం ఉంటామ్ అనుకున్న వంశీ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. హిట్ కథలు అందించిన కాన్ఫిడెన్స్ తో ఎన్టీఆర్ కి కథ కూడా వినిపించాడు. వీరిద్దరి సినిమా కన్ఫార్మ్ అనుకున్న టైంలో వీరి మధ్య ఏంజరిగిందో ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి.

తెలుగులో ‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘టెంపర్’ లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు వక్కంతం వంశీ కథా రచయితగా పనిచేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ వక్కంతం వంశీ డైరక్షన్ లోనే సినిమా చేస్తారని నిన్న మొన్నటి వరకు వినిపించింది. అయితే మధ్యలో ఏం జరిగిందో ఏమో గానీ సడెన్ గా ఎన్టీఆర్‌ క్యాంప్ నుంచి వక్కంతం బయటకు వచ్చేసాడన్న వార్త షాక్ లా మారింది. ఎన్టీఆర్ తో చేద్దామనుకున్న కథను అల్లు అర్జున్ తో వక్కంతం ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

ఎన్టీఆర్ కి వక్కంతం కి మధ్య ఏదన్నా విభేదం తలెత్తిందేమో అనే అనుమానాన్ని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిన్న మొన్నటివరకు ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ఓకే అనుకున్న వక్కంతం సడెన్ గా అల్లు అర్జున్ వైపు షిఫ్ట్ అవటానికి కారణాలు ఏమైవుంటాయనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. దీనిపై వక్కంత ఇప్పటివరకు స్పందించకపోవడం విశేషం. కాగా జూనియర్ కూడా జనతా గ్యారేజ్ తరువాత ప్రాజెక్ట్ ఇంకా కన్ఫార్మ్ కాలేదనే మాట మాట్లాడటంతో మరింత అనుమాను వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.